Begin typing your search above and press return to search.

నాని మరో హార్ట్ టచింగ్ మూవీ

By:  Tupaki Desk   |   2 Jan 2023 4:40 AM GMT
నాని మరో హార్ట్ టచింగ్ మూవీ
X
నేచురల్ స్టార్ నాని లో ఎంత కామెడీ సీన్స్ ఉంటుందో అదే తరహాలో గుండెని పిండేసే ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఈ రెండు వేరియేషన్స్ లో మాత్రం అతను ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగలడు అని చాలాసార్లు నిరూపించాడు. అలాగే కొన్నిసార్లు కొన్ని సినిమాలలో నవ్విస్తూ ఎడిపించాడు కూడా. అలాంటి సినిమాలే అతనికి మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. ముఖ్యంగా ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో నాని స్పెషల్ హీరో అని చెప్పవచ్చు.

అయితే జెర్సీ సినిమాలో మాత్రం ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఆకట్టుకున్నాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక నాని అందులో ఒక అబ్బాయికి తండ్రి పాత్రలో కనిపించిన విధానం కూడా హైలైట్ అయింది. అయితే ఇప్పుడు 30వ సినిమాలో కూడా నాని ఒక పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు.

జెర్సీ సినిమాలో తండ్రిగా ఒకసారి గుండెను పిండేసేలా చేసినా నాని ఈసారి కూడా చాలా ఎమోషనల్ గా ఆకట్టుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక నాని 30వ సినిమా శౌర్యువి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక పాపకు తండ్రిగా నాని ఒక క్యూట్ వీడియోతో న్యూ ఇయర్ విషెస్ చెబుతూ అప్డేట్ అయితే ఇచ్చాడు.

ఇక మరోవైపు నాని శైలేష్ కొలక్ను దర్శకత్వంలో కూడా కొనసాగింపుగా మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే నాని శ్రీకాంత్ దర్శకత్వంలో దసరా అనే సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని కెరీర్ లోనే ఆ సినిమా అత్యధిక భారీ స్థాయి బడ్జెట్లో రూపొందుతోంది.

ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి రెండు సినిమాలను ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే నాని త్వరలోనే మరొక రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.