Begin typing your search above and press return to search.

V ట్రైల‌ర్ .. ప్రైమ్ వాళ్ల‌కు పాన్ కార్డ్ చూపాలా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 10:45 AM IST
V ట్రైల‌ర్ .. ప్రైమ్ వాళ్ల‌కు పాన్ కార్డ్ చూపాలా?
X
ప్రచారంలో స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల‌తో దూసుకుపోవాలంటే నాని త‌ర్వాత‌నే. కానీ ఈసారి ఏమైందో కానీ `వి` ప్ర‌మోష‌న్స్ లో ఏమంత గ్రిప్ క‌నిపించ‌డం లేదు. స‌రిక‌దా నెటిజ‌నుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి కావాల్సి వ‌స్తోంది. మిడ్ నైట్ వ‌ర‌కూ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌రా? అంటూ సోష‌ల్ మీడియాల్లో నిల‌దీసేవాళ్లే ఎక్కువ‌వుతున్నారు. అయినా నానీ.. ఎందుక‌ని ఈ విల‌క్ష‌ణ ప్ర‌చారం.. కాస్త ఆలోచించ‌కూడ‌దూ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లింత‌కీ ఏమైంది అంటే..?

`వి- ది మూవీ` సెప్టెంబర్ 5 న OTTలో విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీక్ష‌కుల‌కు ప‌సందైన విందును అందించ‌నుంది. తాజాగా ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు కొత్త స్కీమ్ ని ప్ర‌వేశ పెట్టింది చిత్ర‌బృందం. అభిమానులను ఆకర్షించడం కోసం.. సోషల్ మీడియా యూజర్లు `వి`.. `విక్ట్ హ్యాండ్ సైన్` తో ఫోటో అప్ ‌లోడ్ చేయమని అడిగే ఆలోచన వచ్చింది. పోస్ట‌ర్ అంతా దీంతో నింపాల‌ట‌. ఐడియా బావున్నా.. ఆచ‌ర‌ణ కుదిరేప‌నేనా? ఇలా అయితే మిడ్ నైట్ అవుతుంది ట్రైల‌ర్ లాంచ్ అయ్యేప్ప‌టికి అంటూ విసుక్కుంటున్నారు నెటిజ‌నం. ఈ డిలేకి నాని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఈ ఆలోచ‌నే సరిగ్గా లేదు అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ట్రైలర్ ‌ను విడుదల చేయమని ప్రైమ్ కూడా ఆధార్.. పాన్ కార్డులను అడగబోతున్నారా? అని అంటూ సెటైర్లు వేస్తున్నారు కొంద‌రైతే. ఐడియా బావున్నా అంద‌రూ ఆమోదించాల‌ని అనుకోకూడ‌దు! అంటూ పంచ్ లు వేస్తున్నారు.