Begin typing your search above and press return to search.
సుకుమార్ శిష్యుడు నానితో 'దసరా'
By: Tupaki Desk | 16 Sep 2021 4:30 PM GMTనాని హీరోగా వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. 'వి' మరియు 'టక్ జగదీష్' లు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాయి. అయినా కూడా ప్రేక్షకులు నాని సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. నాని వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. గత రెండు సినిమాలు ఓటీటీ ద్వారా వచ్చినా ముందు ముందు మాత్రం మొత్తం థియేటర్ల ద్వారా వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చిన నాని అతి త్వరలోనే శ్యామ్ సిగరాయ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చే ఏడాదిలో అంటే సుందరానికి అనే సినిమాను తీసుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా షూటింగ్ ముగిసింది.. మరోటి ముగింపు దశకు వచ్చింది. ఈ సమయంలోనే కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నాడు.
నాని కొన్ని నెలల క్రితం సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ కు ఓకే చెప్పాడు. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఆ సినిమాను ఎట్టకేలకు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏంటీ అంటే ఈ సినిమా టైటిల్ కూడా 'దసరా' అంటూ వార్తలు వస్తున్నాయి. నానితో ఒక మంచి చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ప్లాన్ చేశాడని.. సుకుమార్ కు చాలా బాగా కథ నచ్చిందని.. అదే కథ నానికి కూడా నచ్చిందని చెబుతున్నారు. అంటే సుందరానికి సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత వెంటనే దసరా సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.
నాని తో 'దసరా' అనే సినిమా మొదలు పెడితే ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. నాని సినిమా అంటేనే చాలా స్పెషల్ అన్నట్లుగా ఉంటుంది. నాని ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఉంటుంది. దసరా సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది. నాని ఫ్యామిలీ తో పాటు ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా దసరాను తీసుకు వస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. వచ్చే ఏడాదిలో శ్యామ్ సింగరాయ్.. అంటే సుందరానికి మరియు దసరా సినిమాలతో నాని ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. సుకుమార్ శిష్యులు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు. ఆయన శిష్యులు సక్సెస్ లు కూడా దక్కించుకుంటున్నారు. ఉప్పెన సినిమా ను చేసిన బుచ్చి బాబు సుకుమార్ శిష్యుడు అనే విషయం తెల్సిందే. అందుకే శ్రీకాంత్ పై కూడా చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. నానితో మొదటి సినిమా సక్సెస్ అయితే ఆయన కెరీర్ సెటిల్ అయినట్లే అంటున్నారు.