Begin typing your search above and press return to search.

కొరటాల ఆశీస్సులతో జగదీష్‌

By:  Tupaki Desk   |   30 Jan 2020 10:12 AM GMT
కొరటాల ఆశీస్సులతో జగదీష్‌
X
నిన్నుకోరి వంటి హిట్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నాని మరియు శివ నిర్వానల కాంబోలో రెండవ సినిమా నేడు ప్రారంభం అయ్యింది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం టైటిల్‌ ను ప్రకటించడం తో పాటు నాని ప్రీ లుక్‌ ను కూడా విడుదల చేయడం జరిగింది. టక్‌ జగదీష్‌ అంటూ ఈ చిత్రానికి టైటిల్‌ ను ఖరారు చేశారు. టైటిల్‌ ఖరారు అయిన ఇన్ని రోజులకు చిత్రంను లాంచనంగా ప్రారంభించారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. నిర్మాతలు దిల్‌ రాజు మరియు నవీన్‌ యేర్నేనిలు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు మరియు యూనిట్‌ సభ్యులకు కొరటాల శివ స్క్రిప్ట్‌ ను అందించగా ముహూర్తం షాట్‌ కు దిల్‌ రాజు క్లాప్‌ కొట్టాడు. ఇక మరో నిర్మాత నవీన్‌ యేర్నేని మొదటి షాట్‌ కు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాని.. శివ నిర్వానల కాంబోలో మరో సక్సెస్‌ గా ఈ చిత్రం నిలవాలంటూ పూజా కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్‌ లు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ చిత్రంలో నానికి జోడీగా రీతు వర్మ మరియు ఐశ్వర్య రాజేష్‌ లు హీరోయిన్స్‌ గా నటించబోతున్నారు. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు మూడు పాటల ట్యూన్స్‌ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ను ఫిబ్రవరి 11 నుండి తమిళనాడు పొల్లాచ్చిలో మొదలు పెట్టబోతున్నారు. ఇదే ఏడాదిలో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. గత ఏడాది మజిలీతో ఆకట్టుకున్న శివ నిర్వాన ఈ ఏడాది టక్‌ జగదీష్‌ తో మెప్పించడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకం గా చెబుతున్నారు.