Begin typing your search above and press return to search.

మళ్లీ పల్లెటూరి అమ్మాయిగా ఫిదా చేయనుందట

By:  Tupaki Desk   |   23 Jun 2020 3:00 PM IST
మళ్లీ పల్లెటూరి అమ్మాయిగా ఫిదా చేయనుందట
X
మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో మొదటి సినిమా ‘ఫిదా’. ఆ చిత్రంలో పల్లెటూరు అమ్మాయిగా చక్కగా నటించి మెప్పించింది. పల్లె అందాలు ఎంత స్వచ్చంగా ఉంటాయో అంతే స్వచ్చంగా సాయి పల్లవి సింపుల్‌ లుక్‌ లో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి పలు చిత్రాల్లో నటించింది. అయితే వాటిలో కొన్ని సినిమాలు నిరాశ పర్చాయి. పల్లెటూరు అమ్మాయిగా మళ్లీ రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో సాయి పల్లవి కనిపించబోతుంది.

విరాటపర్వం చిత్రం ఫస్ట్‌ లుక్‌ లో సాయి పల్లవి లుక్‌ చూస్తే పల్లెటూరు అమ్మాయి అనే విషయం అర్థం అవుతుంది. విరాటపర్వంలోని సాయి పల్లవి లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరోసారి సాయి పల్లవి పల్లెటూరు అమ్మాయిగా నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. నాని హీరోగా రాహుల్‌ సంక్రిత్యన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌ గా ఫిక్స్‌ అయ్యింది.

నాని.. సాయి పల్లవి ఇప్పటికే ‘ఎంసీఏ’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సక్సెస్‌ టాక్‌ దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాలో నటించబోతున్నారు. కథానుసారంగా ఈ చిత్రంలో హీరోయిన్‌ పల్లెటూరు అమ్మాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఫిదా చిత్రంలో మాదిరిగా లంగా ఓణీలో సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించబోతుంది అనేది టాక్‌.