Begin typing your search above and press return to search.

పోల్స్‌ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్‌

By:  Tupaki Desk   |   9 Sep 2017 12:30 AM GMT
పోల్స్‌ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్‌
X
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తారలు ఏ రేంజ్ లో చలాకీగా ఉంటున్నారో తెలిసిన విషయమే. అయితే తారాలు ఏ విషయంపై స్పందించినా కాంట్రవర్సీగా మారడం ఈ రోజుల్లో మామూలే అయిపొయింది. అదే విధంగా ఇతర స్టార్స్ ని ఏ విధంగా అయినా స్పందించినా నెటిజన్స్ గోలా కూడా మామూలే.

అయితే రీసెంట్ గా రానా - నాని వారి ట్విట్టర్ అకౌంట్ లో సంబాషించుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సరదాగా వారు చేసుకున్న కామెంట్స్ తో ఓ రకంగా మీడియాకు మంచి స్టఫ్ ను ఇచ్చినట్టయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే ఈ మధ్య కాలంలో ఎవరు బెస్ట్ హీరో అని సోషల్ మీడియాలో కొందరు వోటింగ్ సిస్టమ్ ని పెడుతున్నారు. అయితే అదే తరహాలో హీరోలు నాని - రానా దగ్గుబాటి - వరుణ్‌ తేజ్‌ - విజయ్‌ దేవరకొండలలో పెద్ద స్టార్‌ ఎవరు? అని పెట్టడంతో నాని అత్యధిక ఓట్స్ తో దర్శనమివ్వడంతో రానా అవును ఆయనే(నాని) అని ట్వీట్ చేశాడు.

దానికి సమాధానంగా నాని "ఎవరు మాట్లాడుతున్నారో చూడండి.. ఇలాగే పోల్స్‌ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్‌.. మనకి వద్దు.. మంచి సినిమాలు చేసుకుంటూ పోదాం’ అని రానాను ఉద్దేశించి ట్వీట్‌ చేయడంతో సోషల్ మీడియాలో వారి సంభాషణ చాలా క్రేజీగా సాగింది. రానా కూడా దానికి ఓకే అనే విధంగా స్పందించాడు. ఏదేమైనా నాని సక్సెస్ ను తలకెక్కించుకోడు అనడానికి ఇదో ఉదాహరణ.