Begin typing your search above and press return to search.

మల్లూ బ్యూటీ.. నానితో హ్యాట్రిక్?

By:  Tupaki Desk   |   14 July 2017 4:28 PM GMT
మల్లూ బ్యూటీ.. నానితో హ్యాట్రిక్?
X
యంగ్ హీరో నాని ఇప్పుడు ఫుల్లుగా ఫాంలో ఉన్నాడు. వరుస పరాజయాల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో.. ఇప్పుడు అర డజన్ హిట్స్ కొట్టి న్యాచురల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసేసుకుంటున్నాడు. రీసెంట్ గా నిన్ను కోరి మూవీతో మూడో హ్యాట్రిక్ మొదలుపెట్టిన నానితో.. ఓ హీరోయిన్ హ్యాట్రిక్ కి ప్రిపేర్ అవుతుండడం విశేషం.

నాని లేటెస్ట్ మూవీ నిన్ను కోరి.. ఈ హీరో కెరీర్ బెస్ట్ అయే రూట్ లో దూసుకుపోతోంది. క్లాస్ మూవీ అని నాని భావించినా.. అన్ని ఏరియాల్లోనూ ఇరగదీసే కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ చిత్రం విజయంలో నానితో పాటు హీరోయిన్ నివేదా థామస్.. కీలక పాత్ర పోషించిన ఆది పినిశెట్టి రోల్స్ కూడా కీలకమే. నివేదా థామస్ కు ఇది నానితో వరుసగా రెండో విజయం. జెంటిల్ మ్యాన్ అంటూ టాలీవుడ్ అరంగేట్రమే నాని మూవీతో చేసిన నివేదా థామస్ కు.. వెంటనే న్యాచురల్ స్టార్ సరసన నిన్నుకోరిలో చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు నాని-నివేదల కాంబో సక్సెస్ జోడీ అయిపోయింది.

నానితో ఈ మల్లూ బ్యూటీ మూడో సారి కలిసి నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మేర్లపాక గాంధీతో మూవీ చేసేందుకు నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. ఓ వారం రోజుల్లోనే ఈ కాంబోపై ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని ఎంసీఏ చేస్తుండగా.. ఎన్టీఆర్ తో కలిసి జై లవ కుశ అంటోంది నివేద. ఈ ప్రాజెక్టులు తర్వాత నాని- నివేదాలు కలిసి నటించే సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.