Begin typing your search above and press return to search.

నాగార్జున, నాని క్రేజీ కాంబినేషన్

By:  Tupaki Desk   |   18 July 2017 8:11 AM GMT
నాగార్జున, నాని క్రేజీ కాంబినేషన్
X
మల్టీస్టారర్ ట్రెండ్ ఆ మధ్య మెల్లిమెల్లిగా టాలీవుడ్ లో కూడా ఊపందుకుంది. అయితే ఇది కేవలం అడపదడప సినిమాలకి మాత్రమే పరిమితి అయింది. తాజాగా వచ్చిన కామెడీ థ్రిల్లర్ ని మల్టీస్టారర్ అని చెప్పలేం, ఎందుకంటే ఈ సినిమాలో నలుగురు మీడియం రేంజ్ హీరోలు కలిసి నటించారు. వీరెవరు ఇంకా స్టార్స్ లిస్ట్ లో లేరు. అయితే చాన్నాళ్లు తరువాత మళ్లీ ఓ మల్టీస్టారర్ సినిమాని నిర్మించేందుకు ఓ అగ్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది.

అక్కినేని నాగార్జున - నాని ఈ సినిమాలో కలిసి నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి ఓ యంగ్ కామెడీ హీరోని ( రీసెంట్ గా సెక్స్ కామెడీ మూవీ లో హీరోగా నటించాడు ) డైరెక్టర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మందుగా ప్రేమమ్ డైరెక్టర్ చందూ మొండేటి తో చేద్దాం అని అనుకున్నారట ఆయన నాగ చైతన్య మూవీ తో బిజీగా ఉండటం తో ఈ కామెడీ హీరో కం డైరెక్టర్ ని అనుకున్నట్టు సమాచారం ..ఇప్పటివరకు యావరేజ్ సినిమాలు తీసి, పర్లేదు బాగానే తీసాడనే పేరు తెచ్చుకున్న ఆ దర్శకుడుని పిలిచి మరీ ఈ మల్టీస్టారర్ బాధ్యతను అప్పగించాడట ఆ అగ్రనిర్మాత. అలానే ఆ అగ్రనిర్మాత బ్యానర్ నుంచి చాలా రోజులు తరువాత సినిమా రాబోతుందని టాక్ రావడంతో, ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే ఆశక్తి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో నెలకొంది. పైగా రైజింగ్ లో ఉన్న నాని - కుర్ర హీరోలకి ఇంకా పోటీ ఇస్తూ దూసుకుపోతున్న నాగ్ కాంబినేషన్ ఈ మల్టీస్టారర్ ను హాట్ టాపిక్ గా మార్చేశాయి.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ దర్శకుడు దగ్గరే అంతా డౌట్ ఫీల్ అవుతున్నారట, రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉన్నా, ఇంతవరకు తన సినిమాలో స్టార్ హీరోలు నటించలేదు, మరి ఇప్పుడు ఒక్కసారి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాని ఆ దర్శకుడు ఎలా డీల్ చేస్తాడన్నదే ప్రస్తుతం మిలియన్ డాలర్స్ క్వశ్చిన్, మరి సరైన ఎక్స్ పీరియన్స్ లేని ఆ దర్శకుడు నాగ్ అండ్ నాని మల్టీస్టారర్ ని ఎలా డీల్ చేస్తాడో చూద్దాం.