Begin typing your search above and press return to search.

నాని అమెరికా సినిమా మొదలైందోచ్

By:  Tupaki Desk   |   23 Nov 2016 11:04 AM IST
నాని అమెరికా సినిమా మొదలైందోచ్
X
కోన వెంకట్ రాసిన కంటెంట్ లో ఏం మ్యాజిక్ చూశాడో తెలియదు కాని.. ఫ్లాపుల్లో ఉన్న కోనతో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇకపోతే కోన అందించిన కథ అండ్ మాటలకు.. కొత్త కుర్రాడు శివ నిర్వాణ డైరక్షన్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు లాంఛనమైంది.

ఫిలిం నగర్ వెంకటేశ్వరస్వామి టెంపుల్ లో ఈరోజు ఉదయం ముహూర్తం కొట్టడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఆల్రెడీ నిన్నటివరకు ''నేను లోకల్'' సినిమా షూటింగులో ఉన్న నాని.. ఇప్పుడు వెంటనే తన తదుపరి సినిమాను మొదలెట్టేశాడు. దాదాపు 80% సినిమాను అమెరికాలోనే చిత్రీకరించబోతున్నారు. ఇక మిగతా భాగం హైదరాబాద్ అండ్ వైజాగ్ లో షూట్ చేస్తారట. అయితే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ షూటింగ్ డిసెంబర్ 5 నుండి మొదలవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ''జెంటిల్మన్'' సినిమాతో ఆకట్టుకున్న నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది.

మొత్తానికి ఈ ఏడాది అప్పుడే నాలుగో సినిమాను కూడా రిలీజ్ చేసేద్దామని చూస్తున్న నాని.. ఇప్పుడు ఇలా వెంటనే తన మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించేయడం నిజంగానే వండర్. గుడ్ లక్ నాని!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/