Begin typing your search above and press return to search.

నాని ధ‌మాకా అలా ఫిక్స‌య్యిందా?

By:  Tupaki Desk   |   4 April 2016 10:30 PM GMT
నాని ధ‌మాకా అలా ఫిక్స‌య్యిందా?
X
నాని సినిమాల పేర్లు భ‌లే ఉంటాయి. పేరు వినిపించ‌గానే చూసేయాల‌న్న ఆస‌క్తి మొద‌ల‌వుతుంటుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ - కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌... అంటూ చాంతాడంత పొడ‌వున్న పేర్ల‌తో సినిమాలు చేసిన నాని ఇప్పుడు ఓ సింపుల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని డిసైడ‌యిన‌ట్టు తెలుస్తోంది. నాని క‌థానాయ‌కుడిగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇదో ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా తెర‌కెక్కుతోంద‌ట‌. ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా కొన్ని వున్నాయ‌ట‌. దాదాపుగా 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొన్న ఈ సినిమాకి తాజాగా పేరు ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. ఎవ‌డిత‌డు? అనే పేరుని నిర్ణ‌యించాల‌ని చిత్ర‌బృందం ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

మొద‌ట ఈ సినిమాకి ధ‌మాకా పేరు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ఉంటుంద‌ని నాని - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి `ఎవ‌డిత‌డు` అనే పేరును ఫిక్స్‌ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న నివేదితా థామ‌స్ న‌టిస్తోంది.