Begin typing your search above and press return to search.

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ 'జెర్సీ' కాంబో రిపీట్‌

By:  Tupaki Desk   |   20 Aug 2021 10:33 AM IST
నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ జెర్సీ కాంబో రిపీట్‌
X
యంగ్‌ హీరో నాని క్రికెటర్ గా కనిపించిన జెర్సీ సినిమాకు జాతీయ అవార్డు దక్కిన విషయం తెల్సిందే. నాని నటనతో పాటు సినిమాలోని ప్రతి విభాగం కూడా హృదయాలను కదిలించే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే జెర్సీకి జాతీయ అవార్డు దక్కింది. జెర్సీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం గౌతమ్‌ హిందీ జెర్సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నిర్మాతలు జెర్సీని అక్కడ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీ జెర్సీ తుది దశకు చేరుకుంది. గౌతమ్‌ తిన్ననూరి తదుపరి సినిమాను రామ్‌ చరణ్‌ తో చేయబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. చరణ్‌ శంకర్ తో సినిమా ఫిక్స్ అవ్వడంతో కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

చరణ్‌ తో సినిమా కంటే ముందుగా మరోసారి నానితో సినిమాను చేసేందుకు గౌతమ్ సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జెర్సీ హిందీ వర్షన్ ను ముగించిన వెంటనే నానితో ఒక సినిమాను చేసేందుకు గాను ఇప్పటికే దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి స్క్రిప్ట్‌ వర్క్ రెడీ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్‌ మూవీకి విభిన్నంగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరోసాని నారి మరియు గౌతమ్‌ ల కాంబో మూవీ అంటే ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి.

నాని గత ఏడాది వి మరియు ఈ ఏడాది టక్‌ జగదీష్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యింది.. అవ్వబోతుంది. నాని తదుపరి సినిమాలు శ్యామ్‌ సింగరాయ్ మరియు అంటే సుందరానికి సినిమా లు థియేటర్‌ రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఇప్పటికే శ్యామ్‌ సింగరాయ్ సినిమా షూటింగ్‌ ముగిసింది. ఇక అంటే సుందరానికి షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ ఏడాదిలోనే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబోలో మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. నాని ఓటీటీ రిలీజ్ లు.. థియేటర్‌ రిలీజ్ లు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో అభిమానులను కంటిన్యూస్ గా ఎంటర్ టైన్ చేయడంతో పాటు విభిన్న సినిమాలతో మరో సారి ఫీల్‌ గుడ్‌ సినిమాను అందించబోతున్నాడు.