Begin typing your search above and press return to search.

ఎస్కేప్ అయిన బన్నీ నాని!

By:  Tupaki Desk   |   17 Nov 2018 8:52 AM GMT
ఎస్కేప్ అయిన బన్నీ నాని!
X
శ్రీను వైట్ల - రవితేజ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'అమర్ అక్బర్ అంటోనీ' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యాట్రిక్ డిజాస్టర్లను ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను కొత్తగా.. డిఫరెంట్ గా తీసినట్టు చెప్పినా రెస్పాన్స్ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంది. ఆడియన్స్ టాక్ కూడా ఆశాజనకంగా లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాతో శ్రీను వైట్ల- రవి తేజ- మైత్రీ వారికి మరో దెబ్బ తప్పేలా లేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా రవితేజ కంటే ముందుగా ఇద్దరు హీరోల దగ్గరకు వెళ్ళిందని.. వారు రిజెక్ట్ చేసిన తర్వాతే రవి తేజ దగ్గరకు వచ్చిందని సమాచారం. మొదటగా శ్రీను వైట్ల ఈ 'అమర్ అక్బర్ అంటోనీ' కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వినిపించాడట. బన్నీకి శ్రీను వైట్ల స్టైల్ సినిమాలు చాలా నచ్చుతాయట.. కానీ ఈ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట. దీంతో శ్రీను వైట్ల ఇదే కథను న్యాచురల్ స్టార్ నాని కి వినిపించాడట. నాని కూడా ఈ కథకు 'నో' చెప్పాడట. తన దగ్గరనుండి ఇలాంటి సినిమాను ఆశించరని.. లైటర్ వెయిన్ లో ఎంటర్టైనర్ అయితే ఆదరిస్తారని చెప్పాడట.

దీంతో ఫైనల్ గా ఈ కథ మాస్ మహారాజా రవి తేజ దగ్గరకు చేరిందట. మాస్ రాజా.. వైట్ల ఇద్దరూ మంచి స్నేహితులు కావడం పైగా గతంలో హిట్ సినిమాలు చేసి ఉండడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏదేమైనా న్యాచురల్ స్టార్.. స్టైలిష్ స్టార్ ఇద్దరూ లక్కీగా ఎస్కేప్ అయినట్టే!