Begin typing your search above and press return to search.
బాహుబలితో జతకలిసిన నాని
By: Tupaki Desk | 25 May 2015 10:22 AM ISTనాని మంచి నటుడే కాని ఆరు పలకల దేహం లేదుకదా ఎలా..? సూర్య అడిగిన రాణి అవకాశం నానికేలా వచ్చింది అని కంగారు పడద్దు. నాని బాహుబలితో కలిసింది కేవలం పాటల విడుదల కార్యక్రమానికి మాత్రమే. రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేసిన నాని సినిమాలకి అతీతంగా ఆయన్ని ఇష్టపడతారు. మొన్న సరదాగా ఫాన్స్ తో జరిపిన చాటింగ్ లోనూ తన అభిమాన దర్శకుడు రాజమౌళి అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు నాని.
రాజమౌళి, కీరవాణి సహా వాళ్ళ కుటుంబీకులతోనూ నానికి మంచి అనుబంధం వుంది. అందుకే బాహుబలి సినిమా పాటల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడీ యువ హీరో. నాని హీరో అయినా కూడా అతనూ కొంతమందికి వీరాభిమాని. అందుకే ఆయన అభిమానించే దర్శకులలో ఒకరైన మణిరత్నం సినిమాకి అడగగానే డబ్బింగ్ చెప్పి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజమౌళి ఈగ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చిన మనోడు మాత్రం పెద్ద ఫేవరే చేశాడు. గతంలో రేడియో జాకీగా పనిచేశాడు నాని. ఆ అనుభవం ఇప్పుడు నానికి బాగానే ఉపయోగపడుతుంది కదూ..!