Begin typing your search above and press return to search.

విడుదలను వాయిదా వేస్తున్న నేచురల్ స్టార్

By:  Tupaki Desk   |   8 April 2020 12:30 AM GMT
విడుదలను వాయిదా వేస్తున్న నేచురల్ స్టార్
X
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుత సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసే పనిలో పడ్డారట. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే 'వి' సినిమా విడుదల ఆపేయడం జరిగింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఈ నెల విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి సినిమా 'టక్ జగదీశ్' గురించి కూడా తెలిపాడు నాని. నిన్ను కోరి సినిమా తో హిట్ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే టక్ జగదీష్ రూపొందుతుంది. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తామని అప్పట్లో చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమాలో నానికి జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఇటీవల గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో హిట్ కొట్టిన నాని తాజాగా వి సినిమాను రిలీజ్ చేద్దామని రెడీ అయ్యాడు. సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్స్, సాంగ్స్ తో ఎంతో బజ్ క్రియేట్ చేసిన వి సినిమా కరోనా వల్ల వాయిదా పడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం విడుదల కావాల్సిన 'వి' సినిమాను జూన్ లో, జూన్ లో విడుదల కావాల్సిన 'టక్ జగదీష్' సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలనీ దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.