Begin typing your search above and press return to search.

శిరీష్‌ లో ఆ రేర్‌ క్వాలిటీ ఉంది : నాని

By:  Tupaki Desk   |   14 May 2019 3:02 PM IST
శిరీష్‌ లో ఆ రేర్‌ క్వాలిటీ ఉంది : నాని
X
అల్లు శిరీష్‌ హీరోగా రూపొందిన 'ఏబీసీడీ' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరో మూడు రోజుల్లో అంటే మే 17వ తారీకున ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది. సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుందని ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అన్నారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నాని మాట్లాడుతూ... ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే నాకు పిల్ల జమీందార్‌ సినిమా గుర్తుకు వస్తుంది. చాలా బాగుంది, సినిమా తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక ఈ కార్యక్రమంకు మధుర శ్రీధర్‌ రమ్మని మెసేజ్‌ పెట్టిన వెంటనే ఒక బాధ్యతగా భావించి వచ్చాను. ఆయన ఎన్నో సినిమాలకు తనవంతు సాయంగా నిలిచారు. మంచి సినిమాకు మద్దతుగా ఉండాలని ఆయన భావిస్తారు. అందుకే నేను ఈ సినిమాకు వచ్చాను.

ఇక శిరీష్‌ గురించి నాని మాట్లాడుతూ.. శిరీష్‌ ఈ వయసులో కూడా ఒక చిన్న పిల్లాడి మనస్థత్వం కలిగిన వ్యక్తి. శిరీష్‌ ఆ రేర్‌ క్వాలిటీని ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నేను సినీ కెరీర్‌ మొదలు పెట్టిన సమయంలో శిరీష్‌ సినిమాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ ను రాస్తూ ఉండేవాడు. అతడు రాసే ఆర్టికల్స్‌, సినిమాల విశ్లేషన, బిజినెస్‌ గురించి అతడు చెప్పే మాటలు విని మంచి నిర్మాత అవుతాడని భావించాను. కాని ట్విస్ట్‌ ఇచ్చి హీరో అయ్యాడు. సినిమాల్లో ఏబీసీడీలు ఎప్పుడో పూర్తి చేసిన శిరీష్‌ స్టార్‌ గా ఏబీసీడీలు ఈ చిత్రంతో మొదలు పెట్టాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన రుక్సర్‌ కు మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను. నాతో ఆమె చేసిన కృష్ణార్జున సరైన ఫలితం రాకపోవడంతో ఆమెకు బ్రేక్‌ దక్కలేదు. ఈసారి తప్పకుండా ఆమెకు బ్రేక్‌ వస్తుందని నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.