Begin typing your search above and press return to search.

వీడియో:దస్ పల్లా హోటల్లో వీరంగమాడిన హీరో

By:  Tupaki Desk   |   27 March 2016 10:20 AM IST
వీడియో:దస్ పల్లా హోటల్లో వీరంగమాడిన హీరో
X
తెర మీద కనిపించే హీరోలకు.. నిజజీవితంలోని వారి తీరుకు ఏమాత్రం సంబంధం ఉండన్న విషయం తాజాగా ఈ యువహీరో తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చేసే చేష్టలకు.. చెప్పే మాటలకు పొంతన లేకపోవటమేకాదు.. ఒక మాటకు.. మరో మాటకు సంబంధం లేకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అతగాడి తీరు చూస్తే.. సదరు హీరోగారి మాటలు భలే ఉన్నాయే అనుకోకుండా ఉండలేం. డబ్బున్న అహంకారంతో పాటు.. లేనిపోని ఆవేశం.. హడావుడి మాటలు అతగాడి మాటల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

తాను సినిమా వాడినని.. రాజకీయాలతో సంబంధం లేదంటూనే.. రెండింటిని ఇష్టారాజ్యంగా కాక్ టెయిల్ చేసే ఈ యువహీరో ఎవరో కాదు.. ఫ్రెండ్స్ బుక్.. పరారే లాంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ నండూరిది. అతగాడి యవ్వారం ఇప్పుడు చర్చగా మారటమే కాదు.. అతని తీరుకు.. మాటలకు ఏ మాత్రం పొంతన లేనట్లుగా కనిపించక మానదు.

హైదరాబాద్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్లుగా మాటలు చెప్పటం.. అంతలోనే తనను చూసి ఏడుస్తున్న వారికి దూరంగా ఊరికి చివరన ఉన్న గచ్చిబౌలిలో (గచ్చిబౌలి ఊరికి చివరంట) ఉంటున్నట్లు చెబుతూనే.. తానీ గొడవలతో విసిగిపోయి ముంబయిలో ఉంటున్నట్లుగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇతనిపై జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్ లో ‘‘ఓవర్ ద మూన్’’ పబ్ కు వెళ్లి రచ్చ రచ్చ చేయటమే కాదు.. అక్కడి వారితో తగువుపడటం.. భౌతిక దాడి చేయటం సీసీ కెమేరా ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

అయినప్పటికీ ఆ విషయాల్ని అస్సలు ప్రస్తావించకుండా.. తాను తీస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వాళ్లదేదో హోటల్ దగ్గర గొడవ అయ్యిందని.. దాని గురించి మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. గొడవ జరిగిందని తనకు చెబుతున్నారని.. కానీ.. తాను గొడవ జరిగిన ప్రాంతంలో అస్సలు లేనని.. తాను ముంబయి నుంచి వచ్చానని.. ఫ్లైట్ టికెట్ ఉందని.. కావాలంటే చూపిస్తానంటూ హడావుడి మాటలతో బుకాయించే ప్రయత్నం చేశారు. హోటల్ సిబ్బందిపై ఇతగాడి దాడి.. ఆ తర్వాత పోలీసుల దగ్గర మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటల గురించి చెప్పే కంటే.. సదరు వీడియోల్ని చూసేస్తే అసలు విషయాలు మీకే అర్థమైపోతాయి. మరిక ఆలస్యం ఎందుకు.. ఆ వీడియోల్ని చూసేయండి.