Begin typing your search above and press return to search.

చస్తే తప్ప సపోర్ట్‌ చేయని నీలాంటి వాళ్లకు దండం : నందు

By:  Tupaki Desk   |   3 Sep 2020 5:40 PM GMT
చస్తే తప్ప సపోర్ట్‌ చేయని నీలాంటి వాళ్లకు దండం : నందు
X
నటుడిగా మెల్ల మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న నందు ప్రస్తుతం 'బొమ్మ బ్లాక్‌ బస్టర్‌' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ ను చాలా విభిన్నంగా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించడంలో నందు సక్సెస్‌ అయ్యాడు. బిబి తో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చేయబోతున్నాను అంటూ నందు చేసిన ఇన్‌ స్టా పోస్ట్‌ తో అంతా కూడా నందు బిగ్‌ బాస్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడేమో అనుకున్నారు. అయితే అదేం కాదు. బిబి అంటే బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అంటూ తేల్చి చెప్పాడు. కొందరు ట్రోల్స్‌ చేసినా కూడా మొత్తానికి అయితే ఆ సినిమాకు మంచి పబ్లిసిటీని దక్కించుకున్నాడు.

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలకు ఎంతో మంది నెగటివ్‌ కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం నందు వాటిని పట్టించుకోరు. కాని తనను బాగా హర్ట్‌ చేసిన వాటికి మాత్రం గట్టి కౌంటర్‌ ఇస్తాడు. తాజాగా మరో నెటిజన్‌ కు కౌంటర్‌ ఇచ్చాడు. రేపు నా బర్త్‌ డే సందర్బంగా బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అప్‌ డేట్‌ ఇస్తానంటూ నందు చేసిన పోస్ట్‌ కు ఒక వ్యక్తికి నువ్వు ఏమైనా స్టార్‌ వా.. రేపటి వరకు ఏం ఆగుతాం.. ఇప్పుడే ఇచ్చేయి చూసి చస్తాం అంటూ కామెంట్‌ పెట్టాడు.

అందుకు బాగా హర్ట్‌ అయిన నందు.. మీలాంటి వాళ్లు నెపొటిజం తొక్క బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారిని సపోర్ట్‌ చేయాలని మాట్లాడుతూ ఉంటారు. సూసైడ్‌ చేసుకునేంత వరకు మీలాంటి వారు బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారిని సపోర్ట్‌ చేయరు. మీలాంటి సూడో బ్యాచ్‌ కు దండం. అయినా నేను ఏమీ స్టార్‌ ను అనలేదు. నువ్వే నాకు దాన్ని తగిలించే ప్రయత్నం చేశావు అంటూ నందు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. నందు సమాధానంకు అంతా కూడా వావ్‌ మంచి కౌంటర్‌ అంటూ అభినందించారు.