Begin typing your search above and press return to search.

నాకు దేవుడిచ్చిన అన్నయ్య బోయపాటి

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:16 AM GMT
నాకు దేవుడిచ్చిన అన్నయ్య బోయపాటి
X
సినిమా ప్రచారం అంటే ఆ సినిమాలో పని చేసిన వాళ్ళ గురించి మాట్లాడతారు లేదా సినిమా కథ గురించి మాట్లాడతారు. కానీ జయ జానకి నాయక సినిమా ప్రచారంలో మాత్రం ఎవరు మాట్లాడినా ఏమి మాట్లాడినా అన్నీ ఆ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఈ సినిమా హీరో బోయపాటినే అన్నంతలా ఆయన పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి పనిచేసిన నటుడు బోయపాటిని ఏకంగా నాకు దేవుడు ఇచ్చిన అన్న అనేశాడు. ఇంకా ఏమి చెప్పాడో ఒకసారి చూడండి.

జయ జానకి నాయక సినిమాలో నటుడు నందు కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు పని చేయడం తన అదృష్టం అని చెబుతూ “ఈ సినిమా విడుదల అవుతుంది , సినిమా ఎంత బాగుంది అనేది నేను చెప్పే పనిలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రేక్షకులకు 100 శాతం నచ్చుతుంది. అందుకని నేను సినిమా గురించి కాకుండా ఈ సినిమా డైరెక్టర్ గురించి చెబుతాను. బోయపాటి గారుతో పని చేసినప్పుడు నాకు అర్ధమైంది ఆయన సినిమాలలో ఎమోషన్ అంతా హై పిచ్ లో ఎందుకు ఉంటుందో. ఎవరైనా డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే బోయపాటి గారిని చూసి నేర్చుకోవచ్చు. ప్రతి సన్నివేశంలో ఎవరు ఏమి చేయాలి ఎంత ఎమోషన్ తో ఉండాలి అనేది దగ్గర ఉండి చెబుతారు. ప్రతి కదిలిక ఎలా ఉండాలో చేసి చూపిస్తారు. అతను ఎంత కష్టపడతారో ఆ దేవుడుకి కూడా తెలియదు. నటుల నుండి తనకు కావలిసిన ఎమోషన్ వచ్చే వరకు విడిచిపెట్టరు. ఫైట్ సీక్వెన్స్ తీయడంలో ఆయన ఒక పని రాక్షసుడులా పని చేస్తాడు. అందుకే మనకు తెర పై చూసినప్పుడు అంతా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పాడు. నాకు ఇండస్ట్రిలో ఏ గాడ్ ఫాదర్ లేడు కానీ ఇప్పటి నుండి నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య దొరికాడు''. అని వీర లెవెల్ లో మాట్లాడాడు నందు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న జయ జానకి నాయక సినిమా ఈరోజే రిలీజైంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. మరో స్టార్ నటులు జగపతి బాబు కూడా నటిస్తున్నాడు ఈ సినిమాలో.