Begin typing your search above and press return to search.

అందమైన అమ్మాయి సైకిలెక్కిన హీరో

By:  Tupaki Desk   |   12 Aug 2015 5:57 PM IST
అందమైన అమ్మాయి సైకిలెక్కిన హీరో
X
హీరో నందు ఇటీవలి కాలంలో రెండు కారణాలతో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒకటి సింగర్‌ గీతామాధుని పెళ్లాడడం, రెండు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించడం. ఇవి రెండూ పాపులారిటీ పెంచాయి. అయితే ఇక అతడి జీవితాశయం బ్యాలెన్స్‌. బాగా నటించి పెద్ద స్టార్‌ హీరోగా ఎదగడం అన్నది అతడి కల. అందుకు తగ్గట్టే కెరీర్‌ ని మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈలోగానే విదేశాల్లో శికారుకు ఉన్న ఏ అవకాశాన్ని నందు వదిలిపెట్టడం లేదు.

నందు ఇటీవలే చికాగో వెళ్లాడు. అక్కడ ఓ రేంజు లో ఎంజాయ్‌ చేశాడు. ఆ దేశంలో కల్చర్‌, బ్యూటీ చాలా నచ్చిందని చెప్పాడు. అంతేనా .. అక్కడ తనకి ఓ అమ్మాయితో విచిత్రమైన అనుభవం ఎదురైందని చెప్పాడు. చికాగోలో ట్రై సైకిల్‌ కల్చర్‌ చూశాను. అమ్మాయిలు టూరిస్టుల్ని ఈ సైకిళ్లపై ఎక్కించుకుని ఊరంతా తిప్పేస్తారు. అలా వచ్చిన డబ్బుని ఆదా చేసి పైచదువుల కోసం ఖర్చు చేస్తారు. నేను కూడా ఓ అమ్మాయి సైకిల్‌ ఎక్కి ఊరంతా తిరగా. తనతో ఓ సెల్ఫీ కూడా దిగానని చెప్పాడు.

అనుభవం గొప్పగా ఉంది. ఈ ఐడియా కూడా బావుంది. మన దేశంలో కూడా అమ్మాయిలు ఇలా కష్టించి డబ్బు పోగేసి పెద్ద చదువులు చదివి కుటుంబానికి ఉపయోగపడితే బావుండు కదూ? కాకపోతే మన కల్చర్‌ ఇంకా అంత డెవలప్‌ కాలేదు లెండి.