Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: అంత వింత ఏముంది?

By:  Tupaki Desk   |   4 Sep 2017 9:49 AM GMT
టీజర్ టాక్: అంత వింత ఏముంది?
X
ఓవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు హీరోగా అప్పుడప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు యువ నటుడు నందు. రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద దర్శకుడితో అతను చేసిన ‘365 డేస్’ దారుణమైన ఫలితాన్నివ్వగా.. హీరోగా నటించిన మిగతా సినిమాల గురించి అసలు చర్చే జరగలేదు. ఇప్పుడతను ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ అంటూ హీరోగా తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కార్తికేయ’ సినిమాలోని హిట్ పాట పల్లవినే టైటిల్ గా పెట్టుకున్న నందు.. ‘జయ జానకి నాయక’లో తనకు కీలకమైన పాత్ర ఇచ్చిన బోయపాటి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయించాడు.

నందు ఒక గదిలో పడుకుని నిద్ర పోతుండగా.. నెమ్మదిగా అతడి మీది నుంచి మబ్బు వీడి ఎండ పడటం.. మరోవైపు సైరన్ సౌండ్ వినిపించడంతో అతను నిద్ర లేస్తాడు. కెమెరా నెమ్మదిగా లాంగ్ షాట్లోకి వెళ్తుంటే.. నందు ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. తీరా చూస్తే అతను మోడు వారిన గోడలతో ఉన్న పెద్ద బిల్డింగ్ మధ్యలో చిక్కుకుని ఉంటాడు. తన పరిస్థితి చూసుకుని.. ‘వాట్ ద ఫ..’ అనడంతో టీజర్ ముగుస్తుంది. ఈ ‘వాట్ ద ఫ..’కు మరో అర్థం చెబుతూ.. ‘వాచ్ ద ఫన్’ అన్న క్యాప్షన్ పెట్టారు ఈ సినిమాకు. వరప్రసాద్ వట్టికూటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి.. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తే ఇదేమంత వింతగా అయితే అనిపించట్లేదు. మరి ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ అనే టైటిల్ కు ఇది ఎంత మాత్రం న్యాయం చేస్తుందో చూడాలి.