Begin typing your search above and press return to search.

6 నెల‌ల్లో 2 కోట్లు కొట్టేసింది!

By:  Tupaki Desk   |   26 Dec 2018 4:05 AM GMT
6 నెల‌ల్లో 2 కోట్లు కొట్టేసింది!
X
దీపం ఉండ‌గానే ఇల్లు స‌ర్ధేయ‌డం ఎలానో తెలియాలిక్క‌డ‌. ఈ విష‌యంలో మ‌న భామ‌లు మ‌హా ముదుర్లు. త‌మ‌వైపు వ‌చ్చే ఒక్కో అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టుకుని తెలివిగా ఆర్జించ‌డంలో ఖ‌త‌ర్నాక్ లు అంటే త‌ప్పేం లేదు. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఏకంగా ఇండ‌స్ట్రీని గుప్పిట్లోకి తీసుకుంటోంది నందిత శ్వేత‌. ఈ అమ్మ‌డు నిఖిల్ స‌ర‌స‌న `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా?` చిత్రంలో న‌టించింది. ఆత్మ ఆవ‌హించిన ప్రేయ‌సిగా భీభ‌త్స భ‌యాన‌క ఆహార్యంతో క‌ట్టి ప‌డేసింది. ఆ సినిమా చూశాక నందిత‌కు అభిమాని కానివాడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. స‌రిగ్గా అదే క్రేజు ఈ అమ్మ‌డికి ఏకంగా అర‌డ‌జ‌ను పైగా అవ‌కాశాల్ని తెచ్చింది. ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2`లోనూ ఈ భామ క‌థానాయిక‌.

ఈనెల 28న నందిత శ్వేత న‌టించిన `బ్ల‌ఫ్ మాస్ట‌ర్` రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో నందిత ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. బెంగళూరు నా స్వ‌స్థ‌లం. 2008లో మోడలింగ్ చేస్తున్న సమయంలో ఓ కన్నడ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను. ఆ త‌ర్వాత నా మొదటి తెలుగు సినిమా `ఎక్కడకు పోతావు చిన్నవాడా?` నా ఫేట్ మార్చేసింది. ఆ సినిమాలో నేను చేసిన అమల క్యారెక్టర్ ఎంతో పేరు తెచ్చింది. న‌టిగా నిరూపించుకునే అవ‌కాశం తొలి ప్ర‌య‌త్న‌మే ద‌క్కింది.. అని తెలిపింది.

ఆ ఒక్క ఛాన్స్ ఈ అమ్మ‌డికి అర‌డ‌జ‌ను అవ‌కాశాలిచ్చింది. కెజిఎఫ్ తో 100కోట్ల క్ల‌బ్ హీరోగా వెలిగిపోతున్న‌ కన్నడ రాక్‌ స్టార్ యశ్ స‌ర‌స‌న ఓ సినిమాకి ఛాన్సొచ్చింది. క‌న్న‌డ‌లో అత్యంత భారీగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అలాగే తెలుగులో - సెవెన్ - అక్షర - ప్రేమకథా చిత్రమ్ 2 ఇలా వరుస సినిమాలు ఖాతాలో ఉన్నాయి. ఇంకా మరో రెండు సినిమాల‌కు సంత‌కాలు చేశాన‌ని నందిత తెలిపింది. ఈ క్యూటీ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటోంది? అన్న‌ది ఆరాతీస్తే.. క‌మిట్ మెంట్ కి రూ.30-40ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాలు క్యూలో ఉన్నాయి. సుమారు 2 కోట్ల వ‌ర‌కూ ఆర్జించింది ఇప్ప‌టికే. కేవ‌లం ఈ ఆరు నెల‌ల్లోనే ఫేట్ డిసైడైంది. 2018 ఈ అమ్మ‌డికి బాగా క‌లిసొచ్చింది. అయితే అంత‌కుముందు ప‌దేళ్ల జ‌ర్నీలో ఎంత పోరాటం సాగించిందో ఓ మారు గుర్తు చేసుకోవాలి.