Begin typing your search above and press return to search.

ఫ్లాప్ హీరోయిన్ హిట్టు కొడుతుందా?

By:  Tupaki Desk   |   6 Sep 2019 4:24 AM GMT
ఫ్లాప్ హీరోయిన్ హిట్టు కొడుతుందా?
X
ఏ ఇండస్ట్రీ లో అయినా వరుస ఫ్లాపులొస్తే ఆ హీరోయిన్ ని ఐరన్ లెగ్ కేటగిరీలో వేసేస్తారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో నందిత శ్వేతా ను అదే కేటగిరీలో వేసేసారు. నిజానికి ఈ అమ్మడికి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ప్లాపులున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' మినహా నందిత నటించిన తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. పైగా అన్నీ డిజాస్టర్లే.

'ఎక్కడికి పోతావు చిన్నవాడ' సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు అందుకున్న ఈ బ్యూటీ కి ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా అనికొని విధంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో మొదలు పెట్టి అమ్మడు నటించిన 'బ్లఫ్ మాస్టర్'- 'ప్రేమ కథా చిత్రం 2' - 'అభినేత్రి 2' - '7' - 'కల్కి' ఇలా వరుసపెట్టి అన్నీ డిజాస్టర్ లయ్యాయి. వీటిలో నందిత కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసింది. నిజానికి వరుస ప్లాపు లొచ్చినా తెలుగులో అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చాయి. అదే నందిత కి కలిసొచ్చింది. లేదంటే ఎప్పుడో తట్టా బుట్టా సర్దేసుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు నందిత శ్వేతా కి ఉన్న ఒకే ఒక్క ఆశ 'అక్షర' . ఈ సినిమాలో టైటిల్ రోల్ లో లెక్చరర్ గా నటిస్తుంది నందిత. వచ్చే నెల అక్టోబర్ లో సినిమా విడుదలవుతోంది. అయితే ఈ సినిమాతో అయినా మళ్లీ తెలుగులో హిట్ అందుకోవాలని చూస్తుంది కన్నడ బ్యూటీ. మరి ఈ సినిమా నందిత ను మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ను చేస్తుందా చూడాలి.