Begin typing your search above and press return to search.

మాజీ లవరును గుర్తు తెస్తుందటగా...

By:  Tupaki Desk   |   12 Jun 2015 3:30 PM GMT
మాజీ లవరును గుర్తు తెస్తుందటగా...
X
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు కనిపించడం లేదు అనుకుంటున్న టైమ్‌లో నవతరం నాయికల వెల్లువ మొదలైంది. ఆకాశమే హద్దుగా స్థానిక భామల రాక మొదలైంది. ఆ తరహాలోనే కాటుక కళ్ల నందిత సినీపరిశ్రమలోకి వచ్చింది. తేజ కాస్టింగ్‌ సెలక్షన్స్‌ చేసినప్పుడు అత్యుత్తమ ప్రతిభావనిగా ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే నీకు నాకు డాష్‌ డాష్‌ కథానాయికగా ఎంపికైంది. ఆ తర్వాత నందిత కెరీర్‌ గురించి తెలిసిందే.

ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒకే ఒక్క సినిమా ఈ తెలుగమ్మాయ్‌ జీవితాన్నే మార్చేసింది. తొలి ప్రయత్నమే పరాజయం పలకరించినా.. ఆ తార్వత మారుతి దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్‌ సక్సెస్‌ సాధించింది. రెండో ప్రయత్నమే నందిత జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలొచ్చాయి. లేటెస్టుగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రంలో సుధీర్‌బాబు సరసన కథానాయికగా నటించింది. అతడి సరసన రెండో అవకాశమిది. ఈనెల 19న రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ చిత్రంలో నందిత పెర్ఫామెన్స్‌ అదిరిపోయిందంటూ ప్రశంసలొస్తున్నాయి.

ఇటీవలే ప్రివ్యూల్లో సినిమా చూశాక సినిమా లవర్స్‌ నందిత నటనకు కితాబిస్తున్నారు. నందిత పాత్రతో ప్రేక్షకులు లవ్‌లో పడడం ఖాయం. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ ఎక్స్‌ గాళ్‌ఫ్రెండ్‌ను, మర్చిపోయిన ప్రేమల్ని గుర్తు చేసుకోవడం ఖాయం అని చెబుతున్నారు. వచ్చే వారమే రిలీజ్‌.. కాబట్టి కాస్త ఓపికపట్టాల్సిందే.