Begin typing your search above and press return to search.

నందిత ఏంటీ టాప్ యాంగిల్ సెల్ఫీలు?

By:  Tupaki Desk   |   7 May 2021 2:30 AM GMT
నందిత ఏంటీ టాప్ యాంగిల్ సెల్ఫీలు?
X
ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా? చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన నందిత‌ ఆత్మ ఆవ‌హించిన ప్రేమికురాలి పాత్ర‌లో అద్భుతంగా అభిన‌యించింది. గొప్ప న‌టి అన్న కితాబు అందుకుంది. శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంలోనూ నందిత త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది. న‌టిగా అవార్డులెన్నో అందుకుని దూసుకుపోతున్న స్పెష‌ల్ ట్యాలెంటు నందిత శ్వేత‌. `ప్రేమ‌క‌థా చిత్రమ్‌` సీక్వెల్ లోనూ న‌టించింది.

ప్ర‌భుదేవా- దేవి 2 చిత్రంలో.. ఎస్‌.జె.సూర్య‌- సెల్వ‌రాఘ‌వ‌న్‌- గౌత‌మ్ మీన‌న్ క్రేజీ కాంబినేషన్ హార‌ర్ మూవీ నేంజ‌మ్ మ‌ర‌ప్ప‌తిలై అనే చిత్రంలోనూ నందిత క‌థానాయిక .శివాజీ గ‌ణేష‌న్‌- సావిత్రి జంట‌గా న‌టించిన క్లాసిక్ మూవీ వ‌నంగ‌మూడి చిత్రం రీమేక్ లోనూ నందిత క‌థానాయిక‌. ఐపీసీ 376 అనే చిత్రంలోనూ నాయికగా న‌టిస్తోంది.

ఇంత‌టి పెద్ద కెరీర్ ని సాగించిన ఈ బ్యూటీ .. ఇటీవల సాటి నాయిక‌లతో పోటీప‌డుతూ వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఇన్ స్టా మాధ్య‌మంగా నందిత టీజింగ్ వీడియోలు ఫోటోలు వేడెక్కిస్తున్నాయి. తాజాగా నందిత హాటెస్ట్ సెల్ఫీ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. నందిత ఏంటీ టాప్ యాంగిల్ సెల్ఫీలు? అంటూ యూత్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

క‌న్న‌డ నుంచి త‌మిళంలోకి అట్నుంచి తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఇంకా స‌రైన అవ‌కాశం రాలేదు. త‌న ప్ర‌య‌త్నం చూశాక అయినా.. పెద్ద స్టార్ స‌ర‌స‌న ఛాన్స్ ద‌క్కుతుందేమో చూడాలి.