Begin typing your search above and press return to search.

హీరోయిన్ లక్కు తెస్తుందంటున్న నిర్మాత!

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:13 AM GMT
హీరోయిన్ లక్కు తెస్తుందంటున్న నిర్మాత!
X
ఇండస్ట్రీలో చాలామంది సీనియర్లు తరచుగా ఓ మాట చెప్తుంటారు. అదేంటంటే 'నిర్మాత పచ్చగా ఉంటే ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది' .. మరి నిజంగా ఎంతమంది నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం. కానీ 'ప్రేమ కథా చిత్రమ్-2' నిర్మాత సుదర్శన్ రెడ్డి మాత్రం తమ సినిమా ప్రోగ్రెస్ తో సంతోషంగా ఉన్నాడట.

అయన సుమంత్ అశ్విన్ హీరోగా సూపర్ హిట్ సినిమా అయిన 'ప్రేమ కథా చిత్రమ్' కు సీక్వెల్ ను నిర్మిస్తున్నాడు. తమ హీరో సుమంత్ అశ్విన్ బాగా చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ "నందిత శ్వేతను ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నాం. ఇప్పటివరకూ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా ప్రోగ్రెస్ తో హ్యాపీ గా ఉన్నాను."

నందిత శ్వేత తెలుగులో తమిళంలో నటించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయని కాబట్టి తమ సినిమాకు కూడా నందిత సక్సెస్ ను తీసుకొస్తుందని నమ్మకంగా చెప్తున్నాడు. నిజంగా ఈ సీక్వెల్ కూడా 'ప్రేమ కథా చిత్రమ్' లా ఘన విజయం సాధించాలని కోరుకుందాం.