Begin typing your search above and press return to search.

నిఖిల్ భామతో నితిన్

By:  Tupaki Desk   |   7 Feb 2018 4:23 AM GMT
నిఖిల్ భామతో నితిన్
X
హీరో నితిన్ మళ్లీ స్పీడు పెంచాడు. అ..ఆ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాక ఆచితూచి సినిమాలు చేయడం మొదలెట్టాడు. అ..ఆ తరవాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన లై చేశాడు. భారీ బడ్జెట్ తో తీసినా ప్రేక్షకులను ఆకట్టుకోలేక భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం కొత్త దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు.

ప్రస్తుతం కృష్ణ చైతన్య సినిమా ఇంకా పూర్తి కాకముందే నితిన్ తరవాత చేయబోయే సినిమాకు ఓకే చెప్పేశాడు. శతమానం భవతితో డీసెంట్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో శ్రీనివాస కళ్యాణం చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కే సినిమాలో నందిత శ్వేతను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ముందు ఇద్దరు.. ముగ్గురు పేర్లు వినిపించినా చివరకు నందితవైపే యూనిట్ మొగ్గు చూపింది. ఈ భామ ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడాలో దెయ్యం పిల్లగా నటించి మెప్పించింది. శ్రీనివాస కళ్యాణంలో తన రోల్ నచ్చడంతో నందిత ఇందులో నటించేందుకు పచ్చజెండా ఊపిందని టాలీవుడ్ లోని లేటెస్ట్ న్యూస్.

శ్రీనివాస కళ్యాణం లో నందితోపాటు మరో హీరోయన్ కూడా నటించనుంది. కాకుంటే ఈ రోల్ కు ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. డైరెక్టర్ సతీష్ వేగేశ్నశతమానం భవతి సినిమాలో చాలామంది నటులతో వెండితెరపై పండగ వాతావరణం చూపించాడు. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం సినిమాలో 50 మందికిపైగానే నటులను తీసుకుంటున్నాడట. ఈలెక్కన వెండితెర మరింత కళకళలాడిపోతుందన్న మాట.