Begin typing your search above and press return to search.

నందిత విషయంలో అన్ని సీన్లు జరిగాయ్

By:  Tupaki Desk   |   21 Nov 2016 5:30 PM GMT
నందిత విషయంలో అన్ని సీన్లు జరిగాయ్
X

నిజానికి ''ఎక్కడికి పోతావు చిన్నవాడా?'' సినిమాతో బ్రేక్ తెచ్చుకున్న నందిత శ్వేత.. అంతకంటే ముందే బ్రేక్ తెచ్చుకోవాల్సి ఉంది. కాని చాలా తెలుగు సినిమాల్లో ఆమెను పెట్టుకున్న తరువాత తీసేశారు. పైగా తమిళంలో అమ్మడు ఎన్ని హిట్లు కొట్టినా కూడా ఇక్కడ మాత్రం బ్రేక్ రాలేదు. కాని ఈ సుందరి మాత్రం.. ఎక్కడికి పోతావు టాలీవుడ్ అన్నట్లు ప్రయత్నిస్తూనే ఉంది.

''తెలుగులో డెబ్యూ చేయడానికి నాలుగేళ్లు ప‌ట్టిందా అని చాలా మంది అడిగారు. కానీ కొన్ని సినిమాల‌ను నేనే రిజక్ట్ చేశాను. కొంద‌రు న‌న్ను వ‌ద్ద‌న్నారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాతో డెబ్యూ చేయాలని అనుకున్నాను. ఇది హిట్ అయింది. అందుకు చాలా ఆనందంగా ఉంది'' అంటోంది నందితా శ్వేత. అయితే అమ్మడు అసలు కొన్ని ప్రాజెక్టులను ఎందుకు వద్దని అనుకుంది.. అలాగే కొన్నింటిలో ఈమెను ఎందుకు తీసేశారు? ''ఇది చాలా మంది హీరోయిన్ల విష‌యంలో జ‌రిగేదే. కొన్ని సార్లు వాళ్ల ప్రాజెక్ట్ లో పాత్ర‌లు ఒక ర‌కంగా ఉండేవి.. నేను ఇంకో రకంగా ఊహించుకునేదాన్ని. ఈ సినిమా చూసి ఓ డైరక్టర్ ఫోన్ చేసి 'నువ్వు ఇంత పెర్ఫార్మ్ చేస్తావ‌ని అనుకోలేదు. కానీ నా ప్రాజెక్ట్ లో నేను నిన్ను మిస్ అయ్యా' అన్నారు. ఆ కామెంట్ పడిందంటే నేను సక్సెస్ అయినట్లేగా'' అంటూ హొయలు పోయింది నందిత శ్వేత.

ఇప్పుడు ఒక సినిమా హిట్టయ్యింది కాబట్టి.. ఇప్పుడు మాత్రం టకటకా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అని చెబుతున్న నందిత.. తన పాత్ర తీరుతెన్నులు బాగుంటూనే అవన్నీ చేస్తాను అంటోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/