Begin typing your search above and press return to search.

బాత్ టబ్బులో భామ పరవాలు.. చూస్తే జిగేలే!!

By:  Tupaki Desk   |   29 Dec 2020 3:30 AM GMT
బాత్ టబ్బులో భామ పరవాలు.. చూస్తే జిగేలే!!
X
బెంగళూరు బ్యూటీ నందిత శ్వేతా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి ఎంట్రీ దొరకటంతో అమ్మడికి అవకాశాలు వరుసగా ఆఫర్ చేసాయి. కానీ నందిత మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. నిజానికి బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. 2008లో 'నంద లవ్స్ నందిత' అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన నందిత.. 2012లో అట్టకత్తి మూవీతో తమిళంలో అరంగేట్రం చేసింది. అక్కడ కూడా అమ్మడికి ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అయింది. ఇక వెనక్కి చూడకుండా తమిళంలో సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత తెలుగులో 'బ్లఫ్ మాస్టర్', అభినేత్రి-2, కల్కి లాంటి సినిమాలలో మెరిసింది. ఇప్పటికి తెలుగులో తనని తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అమ్మడికి సరైన సోలో హిట్ పడలేదు. అందుకే ఇంకా టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి రాలేకపోతుంది. ప్రస్తుతం నందిత 'కపటదారి' అనే తెలుగు సినిమా చేస్తోంది. సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ నుండి రీమేక్ చేస్తున్నారు. ఈ ఒక్క సినిమా తప్ప నందిత చేతిలో వేరే సినిమాలేవీ లేవట. అందుకే హిట్ మూవీ రీమేక్ చేస్తున్నారు కాబట్టి హిట్ అవుతుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అమ్మడికి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. బాత్రూం లోని బాత్ టబ్ లో పడుకొని ఓ రొమాంటిక్ పోజిచ్చింది. అందులో అమ్మడి థైస్ బారుగా పరిచి నెట్టింట చిచ్చురేపుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఆ ఫోటోలో అమ్మడి థైస్ హైలైట్ అవుతున్నాయి. అవి చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.