Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కు మెసేజ్‌ లు చేసి వేదిస్తున్నాడట

By:  Tupaki Desk   |   14 Jan 2020 5:30 PM GMT
హీరోయిన్‌ కు మెసేజ్‌ లు చేసి వేదిస్తున్నాడట
X
సెలబ్రెటీలకు సోషల్‌ మీడియాలో వేదింపులు తప్పవు. ముఖ్యంగా హీరోయిన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చదువుకుంటే ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్ర పోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్‌ చేస్తూ రాక్షస ఆనందం పొందే వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అలాంటి వారు ఉన్నారు. తాజాగా హీరోయిన్‌ నందిత శ్వేత ఇలాంటి వేదింపులను ఎదుర్కొంటుంది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే నందిత శ్వేత తాజాగా వేదింపులను ఎదుర్కొంటుందట. సోషల్‌ మీడియాలో తనను ఫాలో అవుతున్న వాంజి సెలియన్‌ అనే కుర్రాడు పదే పదే నందితకు బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టడం.. పర్సనల్‌ మెసేజ్‌ లు పెట్టడం చేస్తున్నాడట. అతడు చేస్తున్న పనితో నందిత శ్వేతకు సోషల్‌ మీడియాలో తన పేజ్‌ లను ఓపెన్‌ చేయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుందట. దాంతో అతడి పేరును బయటకు చెప్పి అతడు పెడుతున్న ఇబ్బందిని పోస్ట్‌ చేసింది.

ఇలా బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టే వారికి.. ఇలాంటి తప్పుడు మెసేజ్‌ లు పెడుతూ వేదించే వారికి కుటుంబ సభ్యులు ఉండరా.. వారికి అక్క చెల్లి అమ్మ ఉండరా అంటూ ప్రశ్నించింది. వారి కుటుంబంలోని వారికి ఇదే పరిస్థితి ఎదురైతే వారు ఏం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు తనపై బ్యాడ్‌ కామెంట్స్‌ పెడుతున్నా కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే ఆలోచన మాత్రం చేయడం లేదని.. ఎందుకంటే అతడి తప్పు వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని నందిత శ్వేత చెప్పుకొచ్చింది. వ్యవహారం శృతిమించితే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల వద్దకు వెళ్లాల్సి రావచ్చు అంది.