Begin typing your search above and press return to search.

అక్షరాలతో క్రైమ్ థ్రిల్లర్ - ఫస్ట్ లుక్

By:  Tupaki Desk   |   19 Jun 2019 12:55 PM IST
అక్షరాలతో క్రైమ్ థ్రిల్లర్ - ఫస్ట్ లుక్
X
టాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తున్న దర్శకులకు కొదవే లేదు. అందులోనూ చిన్న ఆర్టిస్టులతో రిస్క్ లేని బడ్జెట్ తో చేస్తున్న ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ఆ సిరీస్ లో వస్తోందే అక్షర. నందిత శ్వేత ప్రధాన పాత్రలో మధు నందన్-సత్య-శకలక శంకర్ సపోర్టింగ్ క్యాస్ట్ లో నటిస్తున్న ఈ మూవీకి బి చిన్ని కృష్ణ దర్శకుడు. నీది నాది ఒకే కథతో పేరు తెచ్చుకుని ప్రస్తుతం విరాట పర్వం కు వర్క్ చేస్తున్న సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

రేపు విడుదల కాబోతున్న టీజర్ ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ని వదిలింది టీం. పోస్టర్లోని థీమ్ ని బట్టి చూస్తే రచయిత్రి అయిన హీరొయిన్ రాసే కథలకు బయట జరుగుతున్న క్రైమ్స్ కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. వాటికి ఆ ముగ్గురు మగాళ్ళకు లింక్ ఏంటి అనేదే ఇందులో సస్పెన్స్ గా కనిపిస్తోంది. పెన్ను ముక్క చివరి నుంచి రక్తాన్ని ధారపోస్తున్నట్టు డిజైన్ చేసిన పోస్టర్ ని బట్టి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పారు