Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకోనున్న ఫైర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   2 Jan 2017 1:38 PM GMT
విడాకులు తీసుకోనున్న ఫైర్ బ్యూటీ
X
ఫైర్ మూవీతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది నందితా దాస్. ఇప్పుడామె రియల్ లైఫ్ లో బాధాకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. 2016లో బాలీవుడ్ లో పీక్ స్టేజ్ కి చేరుకున్న విడాకుల సీజన్.. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నందితా దాస్ కూడా తన భర్ సుబోధ్ మస్కరకు విడాకులు ఇస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఏడేళ్ల కాపురానికి అంతం పలకబోతున్నారని వచ్చిన వార్తలను ఆమె ధృవీకరించింది. 'మేం విడాకులు తీసుకోబోతోన్న మాట వాస్తవమే. నేను సుబోధ్ ఇప్పటికే నిర్ణయించుకున్నాం. అయితే.. ఇది సౌమ్యంగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. మా ఆరేళ్ల అబ్బాయే అన్నిటికంటే మాకు ప్రధానం. పేరెంట్స్ గా అతని విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని అనుకుంటున్నాం' అంటూ విడాకుల సంగతి ఖాయం చేసిన నందితా దాస్.. పిల్లాడి విషయంలోనే ఎక్కువగా బాధపడాల్సి వస్తోందని అంటోంది.

విడిపోయిన తర్వాత ముంబైలో కంటే తాను ఎక్కువ కాలం నివసించిన ఢిల్లీలోనే ఉండబోతున్నట్లు చెప్పిన ఆమె.. ప్రస్తుతం తను డైరెక్ట్ చేస్తున్న మాంటో మూవీ పూర్తయ్యేవరకూ ముంబైలోనే ఉంటానని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/