Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ని నోర్మూసుకుని సినిమా తీయ‌మ‌న్న నిర్మాత‌

By:  Tupaki Desk   |   15 May 2023 8:00 AM GMT
డైరెక్ట‌ర్ ని నోర్మూసుకుని సినిమా తీయ‌మ‌న్న నిర్మాత‌
X
`అలా మొద‌లైంది` చిత్రంతో చ‌క్క‌ని విజ‌యం అందుకుని అటుపై మ‌హిళా ద‌ర్శ‌కురాలిగా త‌న కెరీర్ ర‌న్ ని నెమ్మ‌దిగా అయినా స్ట‌డీగా కొన‌సాగిస్తున్నారు నందిని రెడ్డి. సమంత ప్ర‌ధాన పాత్ర‌లో ఓ బేబి లాంటి రీమేక్ సినిమాతోను విజయం అందుకున్న ఈ లేడీ డైరెక్ట‌ర్ కెరీర్ లో కొన్ని ప‌రాజ‌యాలు చ‌వి చూశారు.

ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత `అన్ని మంచి శకునములే` అనే మరో ఫీల్ గుడ్ మూవీతో తిరిగి బ‌రిలో దిగుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. `అర్జున్ రెడ్డి`తో ఫేమస్ అవ్వకముందే విజయ్ దేవరకొండ `అన్ని మంచి శకునములే` క‌థ‌ను మెచ్చుకున్నారని నందిని రెడ్డి తాజా ఇంట‌ర్వ్యూ లో తెలిపారు.

నిజానికి అన్నీ కుదిరితే దేవర‌కొండ చేయాల్సిన సినిమా ఇది. కానీ కుద‌ర‌లేదు. అనంత‌రం ఆమె ప్రధాన పాత్ర కోసం సంతోష్ శోభన్ ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియలో స్వప్నా దత్ పోషించిన పాత్ర గురించి ఇన్ డెప్త్ విష‌యాల‌ను తాజాగా ఓ చాటింగ్ సెష‌న్ లో వెల్ల‌డించారు.

సినిమా కంటెంట్ ని త‌న‌ను అన్నివిధాలా న‌మ్మి స‌హ‌క‌రించిన త‌న నిర్మాత‌ స్వ‌ప్న‌ద‌త్ పై నందినిరెడ్డి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. నిజానికి ఈ సినిమాకి నిర్మాత‌గా స్వ‌ప్న రాజీ లేకుండా బ‌డ్జెట్ వెచ్చిస్తుంటే.. కొన్ని విష‌యాల్లో తాను భ‌య‌ప‌డుతుంటే.. ``నోర్మూసుకుని సినిమా తీయ‌మ‌ని`` అన్నార‌ని స‌ర‌దా చాటింగ్ లో నందిని అన్నారు.

నిర్మాత స్వ‌ప్న‌తో త‌న అనుబంధాన్ని ఆ మాట వెల్ల‌డిస్తోంది. ``ఒక హాయి ఇంకో హాయి క‌లిస్తే అంత వినోదంగా ఉంటుంది `అన్నీ మంచి శ‌కున‌ములే`. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్ల‌లో చూడాల‌ని నందిని రెడ్డి కోరారు. త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.