Begin typing your search above and press return to search.

ఫ్లాపు-ఫ్లాపు.. హిట్టు కొట్టాల‌ని..

By:  Tupaki Desk   |   27 Sep 2015 5:32 AM GMT
ఫ్లాపు-ఫ్లాపు.. హిట్టు కొట్టాల‌ని..
X
అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు నాగ‌శౌర్య‌. అంతే అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి ద‌ర్శ‌కురాలిగా ఆరంభ విజ‌యం అందుకుంది నందినిరెడ్డి. అయితే ఈ ఇద్ద‌రి ఫేట్ ఓవ‌ర్‌ నైట్‌ లో రివ‌ర్సు గేరులో ప‌డింది. నందిని రెడ్డికి జ‌బ‌ర్ధ‌స్త్‌ - నాగ‌శౌర్య‌కు జాదూగాడు ఫ్లాప్‌ లు. అందుకే ఈ ఇద్ద‌రూ ఎట్టి ప‌రిస్థితిలో హిట్ కొట్టాల‌నుకుంటున్నారు. హిట్టాయ‌న‌మః అంటూ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. చెక్ డీటెయిల్స్‌..

కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన నందిని రెడ్డి అలా మొద‌లైంది చిత్రంతో తొలి ప్ర‌య‌త్న‌మే హిట్ కొట్టారు. ప్రారంభ‌మే రంజిత్ మూవీస్ సంస్థ‌లో దామోద‌ర్ రెడ్డి ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంది. అయితే ఆ త‌ర్వాత ద్వితీయ విఘ్నాన్ని మాత్రం క్రాస్ చేయ‌లేక‌పోవ‌డం బ్యాడ్‌. సిద్ధార్థ్ -స‌మంత జంట‌గా తెర‌కెక్కించిన జ‌బ‌ర్ధ‌స్త్ పెద్ద ఫ్లాపైంది. పైగా ఆ సినిమా కాపీ సినిమా అంటూ బ్యాడ్‌ నేమ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత బెల్లంకొండ శ్రీెనుతో సినిమా కోసం ప్ర‌య‌త్నించినా ప‌న‌వ్వ‌లేదు. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య హీరోగా క‌ళ్యాణ వైభోగ‌మే టైటిల్‌ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోంది.

నాగ‌శౌర్య అనూహ్యంగా ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో హిట్ కొట్టాడు. నిర్మాత సాయికొర్ర‌పాటి ఇచ్చిన అవ‌కాశం అత‌డిని స్టార్‌ ని చేసింది. అయితే ఇటీవ‌లే జాదూగాడు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా నాగ‌శౌర్య‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. అందుకే ఈ ఇద్ద‌రూ ఎట్టి ప‌రిస్థితిలో హిట్ కొడితేనే కెరీర్ గాడిలోకి వ‌స్తుంద‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌స్తుతం కూర్గ్‌ లో షూటింగ్ చేస్తున్నారు. రొమాంటిక్‌ సాంగ్స్‌ తీస్తున్నారటలే. స‌ర‌స‌న మాళ‌విక నాయిర్‌ - పెర్ల్ మానే నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఫ్లాపు-ఫ్లాపు క‌లిసి హిట్టిస్తాయేమో చూడాలి.