Begin typing your search above and press return to search.

OTT ఆఫ‌ర్ల కోసం ఇలా గాలం వేయాలా?

By:  Tupaki Desk   |   3 Sept 2020 1:20 PM IST
OTT ఆఫ‌ర్ల కోసం ఇలా గాలం వేయాలా?
X
పెద్ద తెర కంటే బుల్లితెర డిజిట‌ల్ కి ప్రాధాన్య‌త అంత‌కంత‌కు పెరుగుతోంది. మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ ప‌ర్య‌వ‌సాన‌మిది. ఇటీవ‌లి కాలంలో ఓటీటీ కంటెంట్ విస్త్ర‌తి పెర‌గ‌డంతో ఈ రంగంలో ఉపాధి కూడా పెరుగుతోంది. న‌టీన‌టులు స‌హా టెక్నీషియ‌న్లు ర‌చ‌యిత‌ల‌కు మ‌రో బెస్ట్ ఆప్ష‌న్ గా ఓటీటీ వేదిక మారింది. ఇక‌పోతే ఈ వేదిక‌పై ఆర్టిస్టుగా రాణించాలంటే హాట్ హాట్ గా కనిపించ‌క త‌ప్ప‌దు. అలాగే ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌కు త‌గ్గ‌ట్టే బాడీ లాంగ్వేజ్ ని ప్రెజెంట్ చేయాలి.

ఇదిగో ఇవ‌న్నీ గ‌ట్టిగానే ప‌ట్టేసింది బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్. ఈ భామ అడ‌పాద‌డ‌పా పెద్ద తెర‌పై న‌టిస్తున్నా ప్ర‌స్తుతం ఓటీటీపై కాన్ స‌న్ ట్రేట్ చేస్తోంది. ఇటీవ‌లే రిలీజైన `మెట్రో క‌థ‌లు` ఓటీటీ (ఆహా-తెలుగు) సినిమాలో బ్రెస్ట్ క్యాన్స‌ర్ పేషెంట్ గా న‌టించిన నందిని వ్యూవ‌ర్స్ ని బాగా మెప్పించింది. అందులో బ్రాతో మెరుపులు మెరిపించ‌డంతో అది కాస్తా ఆడియెన్ ని అట్రాక్ట్ చేసింది.

అందుకు సింబాలిక్ గా మ‌రోసారి ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. వైట్ బ్రా.. డెనిమ్ జీన్స్ లో నందిని రాయ్ ఇచ్చిన ఫోజు సంచ‌ల‌నంగా మారింది. ``నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎలా ప్ర‌వ‌ర్తిస్తావో నీ యాటిట్యూడ్ చెబుతుంది. మైండ్ కి యాటిట్యూడ్ మిర్ర‌ర్ లాంటిది`` అంటూ అదిరిపోయే కొటేష‌న్ ఇచ్చింది. ఒక ర‌కంగా వెబ్ సిరీస్ లు అయినా వెండితెర అయినా కానీ వేడెక్కించేందుకు ఈ తెలుగ‌మ్మాయి ఎలాంటి భేషాజానికి పోదు! అని చెప్ప‌ద‌లుచుకుంద‌న్న‌మాట‌. మ‌రి ఆఫ‌ర్ ద‌క్కాలంటే ఆ మాత్రం తెగువ చూపించాల్సి ఉంటుంది ఇండ‌స్ట్రీలో.