Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్' బ్యూటీ అదిరే గ్లామర్ షో.. పిక్ వైరల్

By:  Tupaki Desk   |   15 Jun 2021 2:30 AM GMT
బిగ్ బాస్ బ్యూటీ అదిరే గ్లామర్ షో.. పిక్ వైరల్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో కాకుండా ఇటీవలి కాలంలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న యాక్టర్స్ ఉన్నారు. అలాంటి వారిలో హైదరాబాది గ్లామర్ బ్యూటీ నందిని రాయ్ కూడా ఉంటుంది. స్కూలింగ్ విద్యను హైదరాబాద్ లోనే ఫినిష్ చేసిన నందిని.. గ్రాడ్యుయేషన్ మాత్రం లండన్ లో పూర్తి చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అమ్మడు ఎంబీఏ పట్టా పొందింది. అయితే అదే సమయంలో మోడలింగ్ కూడా ప్రారంభించింది. అలా మోడలింగ్ చేస్తూనే పలు బ్యూటీ కాంటెస్ట్ లలో విజేతగా నిలిచింది. ఆ విధంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక 2008లో మిస్ హైదరాబాద్ విన్నర్ అయింది.

ఆ తర్వాత వరుసగా మిస్ ఆంధ్రప్రదేశ్ - పాంటలూన్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ ఏపీ 2010 టైటిల్స్ గెలుచుకుంది. అలా 2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది తెలుగులో కూడా అరంగేట్రం చేసింది. ఆ విధంగా అమ్మడు ఈ పదేళ్లు కెరీర్ లో తెలుగుతో పాటు హిందీ - మలయాళం - తమిళ భాషల్లో సినిమాలు చేసింది. కానీ ఇంతవరకు నందినికి కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు. ఆ మధ్యలో కన్నడ భాషలో కూడా ఓ సినిమా చేసింది. మొత్తానికి నందిని ఇప్పటివరకు సౌత్ భాషలన్నీ కవర్ చేసేసింది. సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా అలరిస్తుంది.

కానీ ఇంతవరకు నందిని గ్లామరస్ క్యారెక్టర్ ఎక్కువగా చేసింది. అలాగే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అలా 2018లో తెలుగు బిగ్ బాస్ సెకండ్ సీసన్ లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. త్వరలోనే సినిమాలో స్పెషల్ సాంగ్ తో కూడా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. హై ప్రేస్ట్ - షూటౌట్ ఎట్ ఆలేరు - మెట్రోకథలు వెబ్ సిరీసులు చేసింది. త్వరలోనే 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ ద్వారా గ్లామరస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ప్రస్తుతం నందిని చేతిలో తెలుగు సినిమాలెవి లేవు. కోతికొమ్మచ్చి సినిమాలో ఐటమ్ సాంగ్ తప్ప.

ఇదిలా ఉండగా.. నందిని గ్లామరస్ బ్యూటీగా కుర్రాకారు ఫేవరేట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు అదిరిపోయే అందాల విందుతో సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. తాజాగా అమ్మడు బ్లాక్ డ్రెస్ లో పిక్ పోస్ట్ చేసింది. మ్యాచింగ్ మినీ డ్రెస్ లో అమ్మడి వయ్యారాలు చూపుతూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. నిజానికి బిగ్ బాస్ నుండి వచ్చాక నందిని గ్లామర్ షో పర్సెంటేజ్ పెంచేసింది. అందుకే అలా పోస్ట్ చేయగానే లైక్స్ షేర్స్ అంటూ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వయ్యారి లేటెస్ట్ పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి ఇకనైనా బిజీ అవుతుందేమో చూడాలి.