Begin typing your search above and press return to search.

#నాంది థియేట‌ర్ లో న‌చ్చి ఓటీటీలోనూ ఆద‌ర‌ణ‌‌

By:  Tupaki Desk   |   15 March 2021 1:30 PM GMT
#నాంది థియేట‌ర్ లో న‌చ్చి ఓటీటీలోనూ ఆద‌ర‌ణ‌‌
X
అల్ల‌రి న‌రేష్ లాంగ్ టైమ్ వెయిటింగ్ ప్ర‌తిఫ‌లించి `నాంది` బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. రొటీన్ కామెడీల‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ కంటెంట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. క్రైసిస్ భ‌యాల న‌డుమ గ‌ట్టి పోటీలో రిలీజైనా ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది. అంత‌కుమించి జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో స‌ఫ‌ల‌మైంది.

ఎమోష‌నల్ స్టోరి చ‌క్క‌ని పెర్ఫామెన్సెస్ తో రూపొందించిన‌ ఈ చిత్రంలో న‌రేష్ అంతే ఎమోష‌న‌ల్ న‌ట‌న‌తో ర‌క్తి క‌ట్టించాడ‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో చూసిన వాళ్లు కూడా తిరిగి ఓటీటీల్లో చూసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిసింది.

``ఆహాలో నాంది బాగా ఆడుతోంద‌ని.. థియేట‌ర్స్ లో చూసినా ఓటీటీలో చూసి జ‌నాలు మొచ్చుకుంటున్నా``ర‌ని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది. నాంది హిట్టు కొట్టిన హుషారులో ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో అత్యంత వేగంగా 50 సినిమాలు చేసిన న‌రేష్ కెరీర్ ఇటీవ‌ల డైల‌మాలో ప‌డింది. మ‌హ‌ర్షి మూవీలో కీల‌క పాత్ర మిన‌హా అంత‌కుముందు వ‌రుస‌గా డ‌జ‌ను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఎట్ట‌కేల‌కు నాంది విజ‌యం జోష్ నింపింది.