Begin typing your search above and press return to search.

NBK పాలిట శివంగిలా దూసుకొస్తోందా?

By:  Tupaki Desk   |   7 Jun 2021 12:30 AM GMT
NBK పాలిట శివంగిలా దూసుకొస్తోందా?
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టుల్ని ఓకే చేస్తూ ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నార‌ని స‌మాచారం. బోయ‌పాటితో అఖండ త‌ర్వాత ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న ఓకే చెప్పారు.

గోపిచంద్ మ‌లినేనితో ఓ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ వేగంగా పూర్త‌వుతోంది. త‌దుప‌రి `ఎఫ్ 3` ఫేం అనీల్ రావిపూడితోనూ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌ని తెలిసింది.

తాజా స‌మాచారం మేర‌కు.. బాల‌య్య సినిమాలో త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బాల‌య్య అప్ క‌మింగ్ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ హీరోయిన్ గా చేసే అవ‌కాశం ఉంద‌ని గుసగుస‌లు మొద‌ల‌య్యాయి. త‌న సొంత బ్యాన‌ర్ లో బాల‌య్య నిర్మించ‌బోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు కాగా వ‌ర‌ల‌క్ష్మికి ఆఫ‌ర్ ద‌క్కింద‌ట‌. అయితే వ‌ర‌ల‌క్ష్మి చేయ‌బోయేది హీరోయిన్ గానా లేక‌ విల‌న్ పాత్ర‌నా..? అన్న‌దానిపై క్లారిటీ లేదు.

నిజానికి వ‌ర‌ల‌క్ష్మి మొర‌టుత‌నం ఉన్న విల‌నీతో ఇంత‌కుముందు మెప్పించింది. విశాల్ పందెంకోడి 2లోనూ ఫ్యాక్ష‌న్ క్వీన్ గా న‌టించి మెరిపించింది. వ‌రుస చిత్రాల్లో ఈ త‌ర‌హా పాత్ర‌లతో మెప్పించింది. అందుకే ఇప్పుడు అలాంటి పాత్ర‌తోనే స‌ర్ ప్రైజ్ చేస్తుందా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.