Begin typing your search above and press return to search.

మళ్లీ నందమూరి మోక్షజ్ఞ ఫోటో వైరల్‌

By:  Tupaki Desk   |   29 Sep 2022 8:34 AM GMT
మళ్లీ నందమూరి మోక్షజ్ఞ ఫోటో వైరల్‌
X
నందమూరి ఫ్యాన్స్‌ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న చర్చకు అతి త్వరలోనే ఫుల్‌ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బాలయ్య తన సన్నిహితుల వద్ద మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన చర్చలు మొదలు పెట్టారు అనేది అధికారికంగా అందుతున్న సమాచారం.

మోక్షజ్ఞ ఫోటోలు ఇంటర్నెట్‌ లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫోటోలు లేదంటే ఏదైనా జనాల మధ్య ఉన్న ఫోటోలు క్లారిటీ లేకుండా ఉంటాయి. అయితే ఈ మధ్య మోక్షజ్ఞ ఫోటోలు సోషల్‌ మీడియాలో మెల్ల మెల్లగా వస్తున్నాయి.

ఆ మధ్య మోక్షజ్ఞ బర్త్‌ డే సందర్భంగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవి ఎంతగా వైరల్‌ అయ్యాయో తెల్సిందే. కొన్నాళ్ల క్రితం తో పోల్చితే ఇప్పుడు మోక్షజ్ఞ బరువు చాలా వరకు తగ్గినట్లుగా అనిపిస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం మోక్షజ్ఞ బరువు తగ్గడం మొదలు పెట్టాడు అంటూ ఇటీవల అభిమానులు మాట్లాడుకున్నారు.

తాజాగా మరోసారి ఈ ఫోటోతో మోక్షజ్ఞ వైరల్‌ అవుతున్నాడు. బాలకృష్ణ 107 వ సినిమా షూటింగ్‌ సందర్భంగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఫ్యామిలీ మరియు బాలయ్య ఫ్యామిలీలు విదేశాల్లో ఇలా ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటో తాజాగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అవ్వడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరింత ఆసక్తి పెరుగుతుందని ఈ ఫోటోకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.