Begin typing your search above and press return to search.

మోక్షజ్నకీ అఖిల్ రూటే ఫాలో అవుతున్నారు

By:  Tupaki Desk   |   6 Sep 2015 7:42 AM GMT
మోక్షజ్నకీ అఖిల్ రూటే ఫాలో అవుతున్నారు
X
మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవడమంటే చిన్న విషయం కాదు. అది ఊరికే వచ్చి ఒళ్లో వాలిపోదు. దానికి ముందు బలమైన పునాది పడాలి. నాగచైతన్య విషయంలో ఏం జరిగిందో అంతా చూశారు. చైతూ తెరంగేట్రం విషయంలో కొంచెం లో ప్రొఫైల్ పాటించాడు నాగ్. పైగా క్లాస్ సినిమాతో అరంగేట్రం చేయించాడు. ఆ ప్రభావం ఇప్పటికీ చైతూను వీడలేదు. అతడికి మాస్ ఇమేజ్ రాలేదు. అందుకే చైతూ మార్కెట్ ఓ స్థాయిని దాటలేదు. ఐతే అఖిల్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించాడు నాగ్. మడి కట్టుకుని కూర్చుంటే కష్టమని భావించి.. కుర్రాణ్ని ముందు నుంచే ప్రమోట్ చేశాడు. తొలి సినిమా విడుదల కాకముందే అఖిల్ కు జనాల్లో ఫాలోయింగ్ వచ్చేలా చేశాడు. ఓవైపు కమర్షియల్స్, మరోవైపు ప్రైవేటు కార్యక్రమాల్లో అఖిల్ తళుక్కుమన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కూ అతణ్ని దగ్గర చేశాడు. అఖిల్ కోసం అభిమానులు యునైటయ్యేలా చేశాడు. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో పెట్టడం మరో ఎత్తుగడ. ఈ ప్లానింగంతా పని చేసి అఖిల్ తొలి సినిమాకు బంపర్ క్రేజ్ వచ్చింది. రికార్డు బ్రేకింగ్ బిజినెస్ తో ఇప్పటికే స్టార్ హీరో అయిపోయాడు అఖిల్.

మొత్తానికి ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో అరంగేట్రం ఎలా ఉండాలో అఖిల్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక టాలీవుడ్ లో జరగాల్సిన మరో పెద్ద అరంగేట్రం నందమూరి మోక్షజ్నది. బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ గురించి.. నందమూరి అభిమానుల ఉత్సాహం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అయినప్పటికీ అఖిల్ తరహాలోనే మోక్షజ్నకు ముందే క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు మోక్షజ్న పుట్టిన రోజు. ఈ సందర్భంగా నందమూరి అభిమానుల సందడి మామూలుగా లేదు. వచ్చే ఏడాది కుర్రాడి సినిమా మొదలయ్యే అవకాశాలుండటంతో ఇప్పట్నుంచే హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. బాలయ్య పుట్టిన రోజుకు ఎంత హంగామా ఉంటుందో అంతా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు, కటౌట్ లతో సందడి చేస్తున్నారు. ట్విట్టర్ లో కూడా దీనికి సంబంధించి హడావుడి కనిపిస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే మోక్షజ్న’ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్ లో టాప్ లో ట్రెండవుతోంది. మోక్షజ్న లాంచింగ్ కు రోజులు దగ్గర పడుతున్న సంగతి దీన్ని బట్టే అర్థమైపోతోంది.