Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ అక్కయ్య కాస్ట్యూమ్స్ డిజైనర్

By:  Tupaki Desk   |   25 Nov 2018 11:00 AM GMT
యంగ్ టైగర్ అక్కయ్య కాస్ట్యూమ్స్ డిజైనర్
X
మొన్నటిదాకా ఎవరికి తెలియక గుట్టుగా గృహిణిగా కాపురం చేసుకుంటున్న స్వర్గీయ హరికృష్ణ కూతురు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల అక్కయ్య సుహాసిని తెలంగాణా మధ్యంతర ఎన్నికల పుణ్యమా అని కూకట్ పల్లి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా పబ్లిక్ లైఫ్ లో ఎప్పుడూ కనపడని సుహాసిని ప్రచారం కోసం బాగానే కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆవిడ ప్రొఫైల్ గురించి అభిమానులకు సైతం పెద్దగా అవగాహన లేదు. ఇవాళ ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని చెప్పిన సంగతులు విని ఆశ్చర్యపోవాల్సిందే.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి దర్శకుడు సురేందర్ రెడ్డికి లైఫ్ ఇచ్చిన అతనొక్కడే సినిమాకు ఈవిడ కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసారట. తమ్ముడి బట్టలన్ని సుహాసిని గారే సెట్ చేసారట. తాత తర్వాత అంత గొప్పగా నటించే సత్తా ఉన్నవాడు జూనియర్ ఒక్కడే అన్న కితాబు ఇచ్చిన సుహాసిని బాబాయ్ బాలయ్య సినిమాలు ఆర్టిసి క్రాస్ రోడ్స్ చాలా చూసేవారట. మొత్తానికి సుహాసినికి సంబంధించిన కొంత సమాచారం అయితే అభిమానులకు తెలిసింది. అయితే జూనియర్ తో సుహాసిని బయట ఎక్కడ కనిపించిన దాఖలాలు అయితే గతంలో లేవు.

కళ్యాణ్ రామ్ సైతం ఎన్నడూ అక్కయ్య ప్రస్తావన తీసుకురాలేదు. అతనొక్కడేకి ఆమె పని చేసిన సంగతి కూడా షేర్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ పుణ్యమా అని కొత్త సంగతులు జనానికి తెలుస్తున్నాయి. తెలుగు సరిగా మాట్లాడలేకపోవడానికి సరైన కారణాలు చెప్పలేక తడబడిన సుహాసిని ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. అన్నట్టు తమ్ముళ్ళు కళ్యాణ్ రామ్-జూనియర్ ఎన్టీఆర్ లు ప్రచారానికి ఎప్పుడు వస్తారో అసలు వస్తారో రారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్