Begin typing your search above and press return to search.

బింబిసారుడి జోరు మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   11 Oct 2022 11:42 AM GMT
బింబిసారుడి జోరు మామూలుగా లేదుగా!
X
స‌రికొత్త క‌థ‌ల‌ని ప్రోత్స‌హించ‌డంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి ముందు వ‌రుస‌లో వుంటున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `118`తో స‌క్సెస్ ని సొంతం చేసుకున్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఆ త‌రువాత `ఎంత మంచివాడ‌వురా` మూవీతో ఫ్లాప్ ని ద‌క్కించుకున్నాడు. అయితే కొంత విరామం త‌రువాత ఫిఫ్త్ సెంచ‌రీకి చెందిన బింబిసారుడి క‌థ‌తో టైమ్ ట్రావెల్ మూవీగా తెర‌కెక్కిన `బింబిసార‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఇండ‌స్ట్రీకి స‌రికొత్త ఎన‌ర్జీని అందించాడు.

మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో హీరో క‌ల్యాణ్ రామ్ మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ య‌మ జోరు చూపించేస్తున్నాడు. ప్ర‌స్తుతం `బింబిసార‌` అందించిన జోష్ తో వున్న క‌ల్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నాడు. బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ స్టోరీతో `డెవిల్ : ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌` మూవీలో న‌టిస్తున్నాడు. ఈ మూవీకి న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇక ఈ మూవీతో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో మ‌రో సినిమా చేస్తున్నారు. NKR19 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా రాజుంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో క‌ల్యాణ్ రామ్ కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. నీసెంట్ గా గోవా లో ఓ షెడ్యూల్ చేశారు.

దీంతో సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా ఎండింగ్ ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ ని ప్రారంభించ‌బోతున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఎస్‌. సౌంద‌ర‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ నుంద‌ట‌.

ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి, జ‌య‌ప్ర‌కాష్, మాథ్యూ వ‌ర్గీస్‌, రాజీవ్ పిళ్లై, ర‌వి ప్ర‌కాష్‌, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ‌, ర‌ఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి, శ్రీ‌ధ‌ర్‌, అశోకన్ విన్సెంట్‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ తదిత‌రులు న‌టిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.