Begin typing your search above and press return to search.

నంద‌మూరి హీరో త్రిపాత్రాభిన‌యం!

By:  Tupaki Desk   |   2 May 2021 10:30 AM GMT
నంద‌మూరి హీరో త్రిపాత్రాభిన‌యం!
X
సినిమాలో డ్యుయ‌ల్ రోల్ పోషించ‌డ‌మే క్రేజీ. ఇక త్రిపాత్రాభిన‌యం అంటే..? క్రేజ్ లో పీక్ అనే చెప్పాలి. ఈ న్యూస్ ఏ హీరో ఫ్యాన్స్ కైనా పండగే. ఈ హ్యాపీ న్యూస్ నంద‌మూరి అభిమానుల‌కు పంచుతున్నాడు హీరో క‌ల్యాణ్ రామ్‌. త‌న అప్ క‌మింగ్ మూవీలో క‌ల్యాణ్ రామ్ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌తిష్టాత్మ‌క బ్యాన‌ర్ మైత్రిమూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎమిగోస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంటే అర్థం.. స్నేహితులు అని. ఇప్ప‌టికే తెలుగులో స్నేహితుడు పేరును మార్చి మార్చి పెట్టి చాలా సినిమాలు తీసేశారు. అందుకే ఈ కొత్త టైటిల్ ను ట్రై చేస్తున్న‌ట్టు టాక్‌.

ఈ మూవీలో ఫీమేల్ క్యారెక్ట‌ర్ కూడా ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఎలాగో ‘ఇండ‌స్ట్రీ లాక్ డౌన్‌’ కొనసాగుతోంది కాబట్టి.. తీరిగ్గా తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది. కొత్త ఫేస్ ను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వివరాలు కూడా త్వరలో వెల్లడికానున్నాయి.

అయితే.. ఇప్పటి వరకూ దాదాపుగా నందమూరి హీరోలంతా త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాతో క‌ల్యాణ్ రామ్ కూడా వారి జాబితాలో చేర‌బోతున్నాడు. మ‌రి, మూడు పాత్ర‌ల్లో క‌ల్యాణ్ రామ్‌ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రుస్తారో చూడాలి.