Begin typing your search above and press return to search.

దిల్ రాజు బ్యానర్ లో నందమూరి హీరో '#NKR20'

By:  Tupaki Desk   |   5 July 2021 9:30 AM GMT
దిల్ రాజు బ్యానర్ లో నందమూరి హీరో #NKR20
X
'పటాస్' సినిమా తరువాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 'బింబిసార' అనే సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ మూవీని అనౌన్స్ చేశాడు. నేడు సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా మరో మూడు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు కళ్యాణ్ రామ్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #NKR19 ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ క్రమంలో తన 20వ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నట్లు ప్రకటించారు.

సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ '118' అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవీ గుహన్ డైరెక్షన్ లోనే '#NKR20' సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో 'క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్' అని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తుంటే ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ - కేవీ గుహన్ కలిసి '118' సినిమా తరహాలోనే మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. #NKR20' చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.