Begin typing your search above and press return to search.
పిలవడమే గౌరవమన్న నందమూరి హీరో
By: Tupaki Desk | 4 Jan 2019 10:42 AM ISTఇంకో ఐదు రోజుల్లో తెరమీదకు రానున్న ఎన్టీఆర్ కథానాయకుడు కౌంట్ డౌన్ క్రమక్రమంగా రోజుల్లో నుంచి గంటల్లో మారేందుకు రెడీ అవుతోంది. నందమూరి అభిమానులకు దీని మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ తారాగణం ఉన్న సినిమాగా ఎన్టీఆర్ చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఏదైనా చిన్న క్యామియో చేసింటే బాగుండేది అన్న వెలితి మాత్రం తారక్ ఫ్యాన్స్ ని వెంటాడుతూనే ఉంది. దీని ప్రమోషన్ లో భాగంగా మీడియాకు అందుబాటులోకి వచ్చిన కళ్యాణ్ రామ్ కు సైతం ఈ ప్రశ్న ఎదురైంది.
అయితే తమ్ముడు బాబాయ్ లను సమంగా బాలన్స్ చేస్తూ సర్దిచెప్పడానికి చాలా ట్రై చేసాడు కళ్యాణ్. తమ్ముడికి సరిపోయే పాత్ర ఉంటే బాబాయ్ పిలిచి మరీ చేయించుకునే వాడని అలా అని మొక్కుబడిగా ఏదైనా చిన్న వేషం ఇస్తే అభిమానులు నిరాశ చెందే అవకాశం ఉండటంతో లేకపోవడమే మంచిదనిపించిందని కవర్ చేసాడు. అంతే కాదు తారక్ ని ఆడియో వేడుకకు పిలిచి లాంచ్ చేయించడం కన్నా ఇంకేం గౌరవం కావాలని రివర్స్ కౌంటర్ వేసాడు.
అయినా ఇంట్లో ఫంక్షన్ కు పిలవడం ప్రత్యేకంగా గౌరవం ఎలా అవుతుందో అనే పాయింట్ పక్కన పెడితే జూనియర్ బయోపిక్ లో లేకపోవడం అనే వెలితిని అందరు ఫీలవ్వడం గుర్తించినట్టు మాత్రం క్లారిటీ ఇచ్చాడు. పనిలో పనిగా అక్కయ్య కోసం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లకపోవడం గురించి ప్రస్తావిస్తూ అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు అంటూ దాటవేసి వ్యక్తిగత కారణాలు అని చెప్పేసాడు. ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ లాంటి సినిమాలో తారక్ చిన్న క్యామియోలో కనిపించినా ఫ్యాన్స్ సంతృప్తిగా ఫీలయ్యేవాళ్ళు కాని ఇప్పటికైతే ఆ ఛాన్స్ లేదింక