Begin typing your search above and press return to search.

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ భార్యామ‌ణుల అనుబంధం

By:  Tupaki Desk   |   25 May 2021 8:30 AM GMT
నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ భార్యామ‌ణుల అనుబంధం
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించే సినిమాల‌న్నిటికీ క‌ళ్యాణ్ రామ్ ఒక నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ఇత‌ర బ్యాన‌ర్ల‌తో క‌లిసి తార‌క్ తో సినిమాల్ని నిర్మించ‌డం రివాజుగా మారింది. ఇది సోద‌రుల మ‌ధ్య ఘాడ‌మైన అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. అన్న క‌ళ్యాణ్ రామ్ అంటే త‌మ్ముడు ఎన్టీఆర్ కి ప్రాణం. సోద‌రుడు ఎన్టీఆర్ అంటే క‌ళ్యాణ్ రామ్ ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉంటారు.

ఇక‌పోతే ఎన్టీఆర్ - క‌ళ్యాణ్ రామ్ కుటుంబాల న‌డుమ చ‌క్క‌ని అనుబంధానికి సింబాలిక్ గా తాజాగా వారి స‌తీమ‌ణుల‌ ఫోటో అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌ణ‌తి.. క‌ళ్యాణ్ రామ్ స‌తీమ‌ణి స్వాతి ఇరువురు ఓ ఫోటోలో క‌నిపిస్తున్నారు. ``తోటి కోడ‌ళ్లు ప్ర‌ణ‌తి తార‌క్- స్వాతి క‌ళ్యాణ్ రామ్ అనుబంధం`` పై అభిమానులు అబ్బుర‌ప‌డిపోతున్నారు. ఆ ఇద్ద‌రూ అక్కా చెల్లెళ్ల‌లానే ఉన్నార‌ని నంద‌మూరి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

తార‌క్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల స్నేహితుడు సుధాక‌ర్ మిక్కిలినేని (యువ‌సుధ బ్యాన‌ర్) తో క‌లిసి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. ఆ త‌ర్వాత కూడా తార‌క్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సినిమాని హ‌రిక సంస్థ భాగ‌స్వామ్యంలో క‌ళ్యాణ్ రామ్ స్వ‌యంగా నిర్మిస్తారు.