Begin typing your search above and press return to search.
నందమూరి బ్రదర్స్ వర్సెస్ అసురన్!
By: Tupaki Desk | 12 Feb 2020 11:00 AM ISTప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది తారక్ కెరీర్ 29వ సినిమా. తదుపరి NTR 30 కోసం ఇప్పటి నుంచే తారక్ సన్నాహకాల్లో ఉన్నారు. పలువురు దర్శకులు వినిపించిన కథల్ని అతడు లాక్ చేశాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తో సినిమాని లాంచ్ చేస్తాడన్న ప్రచారం సాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అసురన్ దర్శకుడు వేట్రిమారన్ కి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్రివిక్రమ్ తో 30వ సినిమా సెట్స్ కెళుతుంది. అటుపై NTR 31 వేట్రిమారన్ తో ఉంటుందని భావిస్తున్నారు.
అయితే ఒకేసారి ఇద్దరు ముగ్గురు లైన్ లో ఉంటే రకరకాల సందిగ్ధతలు తప్పనిసరి. ఎన్టీఆర్ 31 కాల్షీట్లను అన్న కల్యాణ్ రామ్ కి కేటాయించారట. అంటే కళ్యాణ్ రామ్ సూచించిన దర్శకుడితో తారక్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈలోగానే వేట్రిమారన్ మధ్యలో దూరడం కళ్యాణ రామునికి నచ్చడం లేదట. అయితే తారక్ అన్న మాట విని తనతోనే ట్రావెల్ అవుతారా? లేక వేట్రి మారన్ తోనే మూవ్ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.
మరో వైపు సెట్స్ పై ఉన్న ఆర్.ఆర్.ఆర్ 70శాతం పైగా పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. స్సెషల్ ఎఫెక్స్ట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించి చాలా పనులే ఉన్నాయి. అందుకే 2021 సంక్రాంతి కి వాయిదా వేశారు. అప్పటివరకూ తారక్ తన మాట జవదాటకూడదని తన కనుసన్నల్లోనే ఉండాలని జక్కన్న ఆదేశించారు. దీంతో తారక్ కోసం గురూజీ త్రివిక్రమ్ సైతం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితిలో తారక్ తోనే దర్శకుడిగా పరిచయం అవ్వాలని వేట్రి పంతంతో ఉన్నాడట. స్క్రిప్ట్ లాక్ అవ్వడంతో తారక్ 30 వేట్రితోనే ఉంటుందా? లేక త్రివిక్రమ్ తర్వాతే వేట్రితో సినిమా ఉంటుందా? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు మధ్యలో కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమాని తారక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక వేట్రిమారన్ తో చేసే సినిమాలో అన్న కళ్యాణ్ రామ్ ని ఇన్వాల్వ్ చేస్తారా? అన్నదానికి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందిగ్ధత తొలగి పోవాలంటే తారక్ స్పందించాల్సి ఉంటుంది. వేట్రి మారన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ ని వెంకీ హీరోగా తెలుగు లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.