Begin typing your search above and press return to search.

ఉప్పెనకు నటసింహ ప్రశంసలు

By:  Tupaki Desk   |   21 Feb 2021 9:35 AM IST
ఉప్పెనకు నటసింహ ప్రశంసలు
X
వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌ గా పరిచయం అయిన ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ దక్కించుకుని వంద కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు బుచ్చి బాబు మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడిగా మారిపోయాడు. ఈయనతో యంగ్‌ హీరోలు సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు బుచ్చి బాబును అభినందించడంతో పాటు ఒక సినిమా చేద్దాం అన్నారట. తాజాగా నందమూరి బాలకృష్ణ తన మొత్తం కుటుంబంతో కలిసి ఉప్పెన సినిమా ప్రత్యేక షో వేయించుకుని చూశారట. సినిమా బాలయ్యకు చాలా బాగా నచ్చిందట.

చిత్ర యూనిట్‌ సభ్యులను బాలయ్య అభినందించడంతో పాటు దర్శకుడు బుచ్చి బాబును ప్రత్యేకంగా ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఈ ఫొటో చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ కోసం బుచ్చిబాబు ను ఉపయోగించుకోవాలంటూ బాలకృష్ణకు సూచిస్తున్నారు. మోక్షజ్ఞ రెడీగా ఉంటే బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక మంచి లవ్‌ స్టోరీ సినిమా తో పరిచయం చేస్తే వైష్ణవ్‌ తేజ్ మాదిరిగా తప్పకుండా గుర్తింపు దక్కించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటూ నందమూరి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.