Begin typing your search above and press return to search.
అదంతా నిమ్మకూరు మహిమ
By: Tupaki Desk | 1 Jan 2019 10:07 PM ISTప్రస్తుతం ఏ నోట విన్నా ఎన్టీఆర్ బయోపిక్ గురించే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై వీక్షించాలని అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజవుతుంటే, నెలరోజుల గ్యాప్ లో మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరో కం నిర్మాత బాలకృష్ణ తన సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. తాజాగా రానా హోస్టింగ్ చేస్తున్న నంబర్ 1 యారీ కార్యక్రమంలోనూ బాలయ్య ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా రిలీజైన ప్రోమోలో ఎన్ బీకే ఈ సినిమా గురించిన ఆసక్తికర సమాచారాన్ని రివీల్ చేశారు. అసలు ఈ సినిమా ఆలోచన ఎప్పుడు ఎలా మొదలైంది? అని హోస్ట్ రానా ప్రశ్నించారు. అందుకు ఎన్‌బీకే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడంలో అల్లుడు లోకేష్ పాత్రను, అలాగే సహనిర్మాత అయిన విష్ణు ఇందూరి పాత్రను బాలయ్య తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ``స్థల మహిమ .. క్షేత్ర మహిమ అంటాం. ఓ కార్యక్రమం కోసం నిమ్మకూరులో అడుగుపెట్టాను. అక్కడే అనుకోకుండా ఆలోచన వచ్చింది. రామారావు బయోపిక్ చేద్దామనుకుంటున్నానని అల్లుడు నారా లోకేష్ తో అన్నాను. నిమ్మకూరులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు .. ఎందుకో తెలీదు.. అనుకోకుండా ఆలోచన వచ్చింది`` అని చెప్పారు. ఒక నిర్మాతగా ఈ సంగతిని ఇప్పుడు రివీల్ చేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
లోకేష్ తో ఆ మాట అన్న తర్వాత విష్ణు ఇందూరితోనూ ఈ విషయాన్ని ముచ్చటించానని తెలిపారు. విష్ణు మా కుటుంబంలో భాగం.. మా బంధువు.. ఇద్దరం కలిసి ఈ బయోపిక్ చేద్దామని అనుకున్నాం. ఆ తర్వాత మధ్యలో ఆ టాపిక్ వదిలేశాం. కొంత గ్యాప్ తర్వాత బయోపిక్ మొదలు పెట్టేశాం... అని బాలయ్య తెలిపారు. ఇంకా నంబర్ -1 యారీ కార్యక్రమంలో బాలయ్య పూర్తి ఇంటర్వ్యూ లో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాల్ని రివీల్ చేశారని అర్థమవుతోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించగా, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారని ఇదివరకూ రచయిత బుర్రా సాయిమాధవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.