Begin typing your search above and press return to search.

ప్చ్.. బాలయ్య మొహం చూపించట్లేదు

By:  Tupaki Desk   |   29 Dec 2017 5:18 PM GMT
ప్చ్.. బాలయ్య మొహం చూపించట్లేదు
X
అంత హైప్ ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు కాని.. అసలు ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫో కూడా ఇవ్వకుండా సడన్ గా 'ఎన్టీఆర్' బయోపిక్ టీజర్ షూట్ స్టార్ట్ చేశారు. ఇకపోతే ఈ టీజర్లో ఏమీ పెద్ద పెద్ద డైలాగులూ.. లేదంటే ఎన్టీఆర్ తరహాలో మారిపోయిన నందమూరి బాలకృష్ణ గెటప్.. ఇలా ఏమీ ఉండబోవట్లేదు. ఎందుకంటే ఈ టీజర్లో ముఖ్యంగా ఒక వెహికల్ కనిపించబోతోంది.

అప్పట్లో ఒక మెటాడోర్ వెహికల్ ను కాస్త మార్చేసి.. దివంగత నందమూరి తారకరామారావు 1983లో దానిని తన ప్రచారరథం క్రింద వాడారు. దానినే చైతన్యరథం అంటారు. ఆ వెహికల్ కు డ్రైవర్ గా హరికృష్ణ ఉండేవారు. ఇప్పుడు టీజర్లో చూపెట్టే షాట్ ఏంటంటే.. చైతన్య రథం ఎక్కిన ఎన్టీఆర్ ను మనం వెనక నుండి చూస్తున్నాం. ఆయన తన ఎడం చెయ్యిన పైకత్తి.. 'నా తెలుగింటి ఆడపడుచులారా.. తమ్ముళ్ళారా' అంటూ డైలాగ్ స్టార్ట్ చేయగానే కట్. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలైంది అంటూ అక్షరాలు. ఈ సీన్ తో టీజర్ ఉంటుందట.

అంటే కేవలం ఖాకీ తరహాలో ఉండే డ్రస్సు వేసుకున్న బాలయ్యను.. వెనుకనుండి మాత్రమే మనం చూస్తాం అనమాట. అంతేకాని ఇప్పుడు ఆయన ఫేస్ కాని.. లేదంటే ఇతర లుక్ కాని మనం చూడబోం. తేజ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను స్వయంగా బాలయ్యే నిర్మిస్తున్నారు.