Begin typing your search above and press return to search.

బాలయ్యా.. ఇదేం పనయ్యా

By:  Tupaki Desk   |   18 April 2016 1:30 PM GMT
బాలయ్యా.. ఇదేం పనయ్యా
X
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య ఓ వేడుకలో అందరూ పొగ తాగాల్సిందే అంటూ సందేశాన్నివ్వడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఓ ఆడియో ఫంక్షన్లో ‘బొంగు’ అనే పదాన్ని వాడటం మీద కాంట్రవర్శీ నడిచింది. ఆపై ‘సావిత్రి’ ఆడియో వేడుకలో సినిమాల్లో తన పాత్రల గురించి చెబుతూ.. అమ్మాయిలకు కడుపులు చేయాల్సిందే అని మాట్లాడటం ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. లేటెస్టుగా ఓ పెద్ద కార్యక్రమంలో బాలయ్య చేసిన పని ఆయనపై విమర్శలకు కారణమవుతోంది.

నిన్న చెన్నైలో నడిగర్ సంఘం చేపట్టిన క్రికెట్ మ్యాచ్‌‌కు బాలయ్య అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ హుషారుగా అందరితోనూ కలిసిపోతూ.. చలాకీగా కనిపించాడు బాలయ్య. తెలుగు పరిశ్రమ నుంచి ఈ మ్యాచ్ కు హాజరైన అతి కొద్ది మందిలో బాలయ్య కూడా ఉండటంతో ఆయన్ని అందరూ అభినందించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అక్కడ బాలయ్య చేసిన పని మాత్రం అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. మ్యాచ్ చూస్తూ ఉక్కపోత భరించలేక షర్టు విప్పేసిన బాలయ్య.. అంతటితో ఊరుకోకుండా స్టేడియంలో బహిరంగంగా ధూమపానం చేశారు. బనియన్లో ఇలా దమ్ముకొడుతూ కనిపించిన బాలయ్యను చూడా చాలామంది అవాక్కయ్యారు. ఇప్పటికే ‘సావిత్రి’ ఆడియో నాటి వ్యాఖ్యల మీద బాలయ్యను ఓ ఆటాడుకున్న ఇంగ్లిష్ మీడియా ఇలాంటి దృశ్యం దొరికితే ఊరుకుంటుందా? ఓ ఇంగ్లిష్ డైలీ ఈ ఫొటో తీసి వార్త కూడా ప్రచురించింది. దీంతో బాలయ్య ఘనకార్యం అందరికీ అందరికీ తెలిసిపోయింది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి బాలయ్య ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.